AP High Court (Photo-Twitter)

Amaravati, Mar 31: ఏపీ హైకోర్టు సంచలనాత్మక తీర్పు నిచ్చింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష (8 IAS officers to jail for contempt) విధిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. వీరికి రెండు వారాల పాటు కోర్టు (Andhra Pradesh high court ) జైలు శిక్షను విధించింది. అయితే హైకోర్టుకు ఎనిమిది ఐఏఎస్‌ అధికారులు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. పొరపాటు అయ్యిందని, భవిష్యత్తులో ఇలాంటివి పునావృతం కాకుండా చూస్తామని తెలిపారు.

దీంతో కోర్టు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఏడాది పాటు ప్రతీ నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని కోర్టు పేర్కొంది. ఏడాది పాటు సంక్షేమ హాస్టల్‌లో ఒక్కపూట భోజనం పెట్టాలని , అలాగే, ఒకరోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఎనిమిది మంది ఐఏఎస్‌లను హైకోర్టు ఆదేశించింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పై తీర్పును వెలువరించింది.

శ్రీశైలంలో ఉద్రిక్త పరిస్థితులు, కర్ణాటక వాసిపై గొడ్డలితో దాడి, ఆగ్రహంతో స్థానికంగా ఉన్న షాపులను ధ్వంసం చేసి కన్నడిగులు, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు

ఈ మేరకు సీనియర్ ఐఏఎస్‌లు విజయ్‌కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్‌, శ్రీలక్ష్మి, గిరిజాశంకర్‌, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎంఎం నాయక్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.