Andhra Pradesh COVID-19: ఏపీలో కొత్తగా 80 కేసులు నమోదు, 1177 కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య, 31 మంది మృతి, కారణం లేకుండా బయటకు వస్తే నేరుగా క్వారంటైన్‌కే..

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 6517 శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 80 కరోనా పాజిటివ్‌ కేసులు (AP COVID-19 Report) నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1177 కు చేరిందని తెలిపింది. వైరస్‌ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 31 మంది మరణించారని, 235 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.

Coronavirus Outbreak | Representational Image| (Photo Credits: IANS)

Amaravati, April 27: ఏపీలో కరోనావైరస్ (AP Coronavirus) మహమ్మారి రోజురోజుకూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 6517 శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 80 కరోనా పాజిటివ్‌ కేసులు (AP COVID-19 Report) నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1177 కు చేరిందని తెలిపింది. వైరస్‌ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 31 మంది మరణించారని, 235 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. ఏప్రిల్‌ నెల వేతనాలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, కొన్ని శాఖల వారికి పుల్ జీతం, పెన్సనర్లకు 100 శాతం పేమెంట్, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

ప్రస్తుతం ఏపీలో 911 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో ఎంటువంటి కోవిడ్‌ మరణాలు సంభవించలేదని వెల్లడించింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో నలుగురు రాజ్‌భవన్‌ సిబ్బందికి కరోనా సోకినట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. జిల్లాల వారీగా కరోనా బాధితులు, కోలుకున్నవారి వివరాలతో ఆరోగ్యశాఖ (ArogyaAndhra) జాబితా విడుదల చేసింది. తాజాగా గుంటూరు జిల్లాలో- 23, కృష్ణా- 33, కర్నూలు-13, నెల్లూరు-07, పశ్చిమ గోదావరి-03, శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేసు నమోదైంది.

Here's ANI Report

Here's ArogyaAndhra  Report

కృష్ణా జిల్లాలో గత 24 గంటల్లో 33 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో సోమవారం ఉదయం 12 గంటలకు మొత్తం కోరానా పాజిటీవ్ కేసుల సంఖ్య 2 వందలకు చేరింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ప్రధానంగా విజయవాడలోనే ఎక్కువగా కేసులు నమోదుకావడంతో అధికారులు బెజవాడ నగరంపై ప్రత్యేక దృష్టి సారించారు. పాజిటీవ్ కేసులు ఎక్కువగా ఉన్నప్రాంతాలను ఇప్పటికే హాట్ స్పాట్లుగా ప్రకటించారు.  వైసీపీ ఎంపీ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్, రాజ్‌భవన్‌ని వదలని కోవిడ్ 19, పేకాట ఆడిన వ్యక్తి నుంచి 25 మందికి కరోనావైరస్, శ్రీకాకుళం జిల్లాలో కరోనావైరస్ ల్యాబ్

గుంటూరుజిల్లాలో కరోనా పాజిటీవ్ కేసులు 237కు చేరాయి. జిల్లాలో లాక్ డౌన్ ప్రారంభం నుంచే పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక కేసులతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండగా గుంటూరు జిల్లా రెండో స్థానంలో ఉంది. నిన్న మూడు కేసులు నమోదు అయినట్లు చెప్పిన అధికారులు సోమవారం ఒక్క రోజే 23 కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.  30న బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం, మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించిన అధికారులు

కరోనా వైరస్‌ విస్తరించకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి రెడ్‌జోన్‌ ప్రాంతాల నుంచి పాజిటివ్‌ కేసులు వ్యాప్తిచెందకుడా చూస్తున్నారు. ఈ మేరకు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా కట్టడిలో భాగంగా ఇకపై ఎలాంటి కారణం లేకుండా బయట తిరిగే వారిని నేరుగా క్వారంటైన్‌కు తరలించేదిశగా చర్యలు తీసుకుంటున్నారు.