AP coronavirus Report: ఏపీలో తాజాగా 553 కరోనా కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా 10,884 కు చేరిన కేసుల సంఖ్య, రికార్డుస్థాయిలో కోవిడ్-19 పరీక్షలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం

బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 19,085 సాంపిల్స్‌ను పరిశీలించగా 553 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ​దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,884 కు చేరింది. ఇప్పటివరకు ఏపీలో రికార్డుస్థాయిలో 7,69,319 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఏపీ నుంచి 8783 కేసులు, 1,730 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి

Coronavirus Outbreak (Photo Credits: IANS)

Amaravati June 25: ఆంధ్రప్రదేశ్‌లో గురువారం కొత్తగా 553 కరోనా పాజిటివ్‌ కేసులు (AP coronavirus Report) నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 19,085 సాంపిల్స్‌ను పరిశీలించగా 553 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ​దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,884 కు చేరింది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 16,922 కేసులు, దేశంలో 4,73,105కు చేరిన కోవిడ్-19 కేసులు సంఖ్య, నెల రోజుల్లోనే మూడు లక్షల యాభైవేల కేసులు నమోదు

ఇప్పటివరకు ఏపీలో రికార్డుస్థాయిలో 7,69,319 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఏపీ నుంచి 8783 కేసులు, 1,730 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి కాగా, 371 కేసులు ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి సంబందించినవి ఉన్నాయి. కరోనా నుంచి ఇవాళ 118 మంది పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 4988గా ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 136కు చేరుకుంది. ఏపీలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,760గా ఉంది. ఏసీబీ కస్టడీకి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మరో అయిదుగురు డైరక్టర్లు, మూడు రోజుల పాటు వీరిని విచారించనున్న ఏసీబీ

భారత్‌లో కరోనా కేసులు (Coronavirus) రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూడగా.. 418 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,07,871 మందికి పరీక్షలు చేశామని, అందులో 16922 మంది కరోనా పాజిటివ్‌లుగా (COVID-19 Cases) నిర్ధారణ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ నెల 28 వరకు ఏపీ హైకోర్టు విధులు నిలిపివేత, సర్క్యులర్‌ జారీ చేసిన హైకోర్టు రిజిస్ట్రార్‌, ఉద్యోగులపై పలు నిబంధనలు విధించిన న్యాయస్థానం

దేశంలో ఒక్కరోజులోనే దాదాపు 17వేలకు చేరువలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజాగా వచ్చిన కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,73,105 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 14,894గా ఉంది. కరోనా వైరస్‌ (India coronavirus) నుంచి 2,71,696 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,86,514 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif