AP Govt Offices Shifting Row Andhra Pradesh High Court adjourned Enquiry On Vigilance Commission | (Photo-Twitter)

Amaravati, June 25: కోవిడ్‌-19 (COVID-19) నేపథ్యంలో ఈ నెల 28 వరకు ఏపీ హైకోర్టు విధులు (AP High Court regular work) నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, విజయవాడ మెట్రో పాలిటన్‌ కోర్టుల విధులను సస్పెండ్‌ చేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైకోర్టు రిజిస్ట్రార్‌ గురువారం ఈ మేరకు సర్క్యులర్‌ జారీ చేశారు. కాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి ఆదేశాల మేరకు.. కరోనా కట్టడికి తమ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, సందర్శకుల విషయంలో న్యాయస్థానం ఇటీవల కఠిన మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ కస్టడీకి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మరో అయిదుగురు డైరక్టర్లు, మూడు రోజుల పాటు వీరిని విచారించనున్న ఏసీబీ

జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం.. హైకోర్టు అధికారులు (High Court Officers), సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లకూడదు. ఒకవేళ అనుమతి లేకుండా వెళితే దాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. ఎవరైనా అనుమతి తీసుకుని రాష్ట్రం దాటితే, తిరిగి విధుల్లోకి వచ్చే ముందు విధిగా క్వారంటైన్‌లోకి వెళ్లితీరాలి. హైకోర్టు ప్రవేశ ద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు తప్పనిసరి. అనంతరం మాస్కులు ధరించినవారినే లోపలికి అనుమతిస్తారు. జ్వరం, కోవిడ్‌ లక్షణాలున్న వారిని కోర్టు ప్రాంగణంలోకి అనుమతించబోరు. ఏపీ ప్రభుత్వం మరో సంచలన పథకం, మూగ జీవాల కోసం వైఎస్సార్‌ పశు సంరక్షణ స్కీం, మూగజీవాలకు ఆరోగ్య రక్షణ కార్డులు మంజూరు

ఆంధప్రదేశ్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ నిన్న గుండెపోటుతో మృతి చెందారు. హైకోర్టులో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన ఇన్ చార్జీ రిజిస్ట్రార్ జనరల్ గా ఉన్నారు. కొత్తగా మరో మహిళా అధికారిని రిజిస్ట్రార్ జనరల్ గా నియమించారు. ఆమె చార్జీ తీసుకున్న మరుసటి రోజే రాజశేఖర్ మరణించడం విషాదకర పరిణామం.