AP Covid-19 Report: ఏపీలో 40 వేలు దాటిన కరోనా కేసులు, తాజాగా 2,602 మందికి కోవిడ్-19 పాజిటివ్, 534కి చేరిన కరోనా మృతుల సంఖ్య

రాష్ట్రంలో కొత్తగా 42 మరణాలు సంభవించగా, కరోనా మృతుల సంఖ్య (Covid-19 Deaths) 534కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో మరో 2,602 మందికి పాజిటివ్ అని తేలింది. జిల్లాల వారీగా చూస్తే తూర్పుగోదావరిలో అత్యధికంగా 643 కేసులు నమోదయ్యాయి. అటు, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40,646కి చేరింది. తాజాగా 837 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 19,814 మంది చికిత్స పొందుతున్నారు.

coronavirus in india (Photo-ANI)

Amaravati, July 17: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేల మార్కు (AP Covid-19 cases) దాటింది. రాష్ట్రంలో కొత్తగా 42 మరణాలు సంభవించగా, కరోనా మృతుల సంఖ్య (Covid-19 Deaths) 534కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో మరో 2,602 మందికి పాజిటివ్ అని తేలింది. జిల్లాల వారీగా చూస్తే తూర్పుగోదావరిలో అత్యధికంగా 643 కేసులు నమోదయ్యాయి. అటు, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40,646కి చేరింది. తాజాగా 837 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 19,814 మంది చికిత్స పొందుతున్నారు. ఇకపై మాస్క్ తప్పనిసరి, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్, ముస్కాన్‌ కోవిడ్‌–19కు విశేష స్పందన, నెల 20వ తేదీ వరకు ఆపరేషన్‌ ముస్కాన్‌ కోవిడ్‌–19 కార్యక్రమం

కోవిడ్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది మృత్యువాత పడ్డారు. అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, కడపలో ముగ్గురు, విశాఖలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కృష్ణాలో ఒకరు కోవిడ్ వల్ల మృతిచెందారు.

Here's AP Coronavirus Report

ఇటీవల కరోనా బారిన పడిన ఐపీఎస్‌ దంపతులు కరోనాను జయించి తిరిగి శుక్రవారం విధుల్లో చేరారు. దిశా స్పెషల్‌ ఆఫీసర్‌ దీపికా పాటిల్‌, డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌ దంపతులు ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరిన ఐపీఎస్‌ దంపతులకు డీజీపీ గౌతం సవాంగ్‌ ఘనస్వాగతం పలికారు.

ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) నిర్ణయం తీసుకుంది. మాస్క్ వినియోగం తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, పని చేసే స్థలాలు, ప్రయాణ సమయంలో మాస్క్ కచ్చితంగా వినియోగించాలని సర్కార్ ఆదేశించింది.