Amaravati, July 17: ఏపీలో కరోనావైరస్ కట్టడికి ఆంక్షలు మరింత కఠినంగా అమలు కానున్నాయి. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రవాణా సమాయాల్లో మాస్కు ధరించటాన్ని తప్పనిసరి (Face Masks in AP) చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు (AP Govt Issued Orders) జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సూచించిన నిర్దేశిత ప్రమాణాల్లో భాగంగా ఫేస్ మాస్కు, ముఖం కప్పుకునేలా కవర్ ఉండటాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశిలిచ్చింది. నాన్నా నీకు నెగిటివ్ అంటూ కొడుకు అరుపులు..కరోనా పాజిటివ్ అని భ్రమపడి కుప్పకూలిన తండ్రి, ఏలూరులో విషాద ఘటన
ప్రజలు మాస్కు ధరించేలా విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు, మాస్కు ధరించటాన్ని (wearing masks) అలవాటుగా మార్చుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులకు ప్రభుత్వం (AP Govt) ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ సమయంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఫేస్ మాస్కు తప్పనిసరి చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్ (Operation Muskan) సత్ఫలితాలు ఇస్తోంది. రాష్ట్రంలోని వీధి బాలలను (Street Childerns) గుర్తించి వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి సంరక్షించే అరుదైన కార్యక్రమం ముస్కాన్ కోవిడ్–19కు (Muskan COVID-19) విశేష స్పందన లభించింది. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మూడు రోజుల్లో 837 మంది వీధి బాలలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
వారిలో ముగ్గురికి కరోనా లక్షణాలు ఉండటంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రకాశం జిల్లాల్లోని ఇద్దరిని గిద్దలూరు క్వారంటైన్‌కు, విజయనగరం జిల్లాలో ఒకరిని హోం క్వారంటైన్‌ను తరలించారు. ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ శాఖల సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలను సీఐడీ అడిషినల్ డీజీ పీవీ సునీల్‌కుమార్ సాక్షికి తెలిపారు.
ఏపీ డీజీపీ సవాంగ్ ఈ నెల 14న ప్రారంభించిన ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్–19 కార్యక్రమం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోను ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది. గడిచిన 3 రోజుల్లో 2,670 మంది వీధి బాలలను పోలీసులు గుర్తించారు. వారిలో 2,339 మంది బాలురు, 331 మంది బాలికలున్నారు. 33 మంది ఇతర రాష్ట్రాల వారున్నారు. ముస్కాన్ ద్వారా గుర్తించిన వీధి బాలల్లో 2,500 మందిని తల్లిదండ్రుల వద్దకు చేర్చగా, మరో 170 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించారు. బాలికలతో చాకిరీ చేయిస్తున్న వారిపై మూడు కేసులు నమోదు చేయగా, మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులిచ్చారు.