Coronavirus Vaccine (Photo Credits: ANI)

Amaravati, July 17: ఏపీలో ఏలూరులో విషాదం చోటు (Eluru Man Death) చేసుకుంది. తండ్రికి కోవిడ్-19 (Coronavirus) సోకలేదనే విషయాన్ని కొడుకు బిగ్గరగా అరిచి చెప్పడంతో (felt wrongly Covid 19 Results) భయపడిన తండ్రి అక్కడికక్కడే కుప్పకూలాడు, సమీపంలోనే ఉన్న వైద్య సిబ్బంది చికిత్స చేసేందుకు అతన్ని అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్టు నిర్దారించారు. మహిళల మానసిక వేధింపులతో వృద్ధుడు ఆత్మహత్య, సూసైడ్‌ నోట్‌ రాసి బలవన్మరణానికి పాల్పడిన లక్ష్మీపతిరావు, ఏపీలో తణుకులో విషాద ఘటన

వివరాల్లోకెళితే.. ఏలూరులో బడేటి వారి వీధిలో నివాసం ఉంటున్న కే అప్పారావు (62), తన కుమారుడితో కలిసి ఇటీవల కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ 'సంజీవని' వద్దకు వచ్చి ఇద్దరూ నమూనాలు ఇచ్చారు. అయితే అందులో నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని కుమారుడు ‘నాన్నా నీకు కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌ (Coronavirus Negative) వచ్చింది’ అంటూ బిగ్గరగా అరిచి చెప్పాడు. అది అర్థం కాక తనకు కరోనా వచ్చేసిందనే తీవ్ర ఆందోళనతో ఆ తండ్రి అక్కడికక్కడే కుప్పకూలాడు.

అక్కడ ఉన్న వైద్య సిబ్బంది అప్పారావుకి రెస్పిరేటరీ సిస్టమ్‌ ద్వారా శ్వాస అందించేందుకు ప్రయత్నించారు. 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి వెంటనే ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే అప్పారావు మృతి చెందినట్లు ధృవీకరించారు. ఇదిలా ఉంటే అప్పారావు మృతదేహానికి గురువారం రాత్రి కరోనా పరీక్షలు చేయగా ఈసారి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది