Amaravati, July 17: ఏపీలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పక్క వారు మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారనే బాధతో అపార్ట్ మెంట్ పై నుండి దూకి ఆత్మహత్యకు (Old Man Commit Suicide) పాల్పడ్డాడు. ఈ మానసిక వేధింపులు, అలాగే పోలీసులతో పోరాడే శక్తి నాకు లేదంటూ సూసైడ్ నోట్ (suicide note) రాసి మరీ బలవన్మరణానికి పాల్పడిన తీరు (84 year old man committed suicide) అక్కడి వాసులను కలచివేస్తోంది. దీనికి ప్రధాన కారణం అపార్టుమెంటు కమిటీ సభ్యులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదులు చేయడమేనని అయిదు పేజీల సూసైడ్ నోట్‌లో ఆ వృద్ధుడు రాసాడు. సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ, బీహార్ ఎంపి పప్పు యాదవ్ లేఖపై స్పందించిన హోంమంత్రి, సుశాంత్ సింగ్ గర్ల్‌ఫ్రెండ్‌కి తప్పని వేధింపులు
వివరాల్లోకెళితే.. పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసి రిటైర్ అయిన కోరుకొండ లక్ష్మీపతిరావు అనే వృద్ధుడు తణుకు సజ్జాపురంలో (West Godavari Tanuku ) జయలక్ష్మీ రెసిడెన్సీ పేరుతో తన సొంత స్థలంలో అపార్టుమెంటు నిర్మించారు. అపార్టుమెంటు పక్కన మరో ఇంట్లో ఆయన నివాసం ఉంటున్నారు. అపార్టుమెంటులో ప్లాట్లు మొత్తం విక్రయించిన ఆయన అయిదో అంతస్తులో ఒక ప్లాటు మాత్రం తన అధీనంలో ఉంచకుని అద్దెకు ఇస్తూ వస్తున్నారు.
గతంలో అపార్టుమెంటు వ్యవహారాలన్నీ చూసుకున్న లక్ష్మీపతిరావు వయసు పెరుగుతుండంతో ఆ బాధ్యతల నుంచి తాను తప్పుకుని కమిటీ ఏర్పాటు చేసి వారికి అప్పగించారు. ఇదే ఆయన ప్రాణాలను తీసివేసింది. కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న వంక లక్ష్మీకుమారి, శేష అనే ఇద్దరు తనపై తరచూ వాగ్వాదానికి దిగుతున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. తన ప్లాటులోకి ఎవర్నీ అద్దెకు రానీయకుండా అడ్డుకోవడంతోపాటు వచ్చిన వారిని ఖాళీ చేయించే వరకు వీరు నిద్రపోరని ఆయన చెప్పుకొచ్చారు.
వీరికి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న అబ్రహం అనే వ్యక్తి కూడా తోడు కావడంతో వేధింపులు మరీ ఎక్కువయ్యాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తామంటూ పలు పర్యాయాలు తనను బెదిరించారంటూ లేఖలో ప్రస్తావించారు. అయితే పోలీసులు వారిని హెచ్చరించి పంపించి వేసినట్లు పేర్కొన్నారు.
అయినప్పటికీ వారు వేధింపులకు పాల్పడుతుండటంతో తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డానని లేఖలో పేర్కొన్నారు. మృతుడి భార్య జయలక్ష్మి లేక సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తణుకు పోలీసులు చెప్పారు. వృద్ధులపై వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చట్టాలు అమలు చేసే అధికారం ఉన్న పోలీసులు ఈ కేసులో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీపతిరావు ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తూ ఉచితంగా వసతి కల్పిస్తూ వస్తున్నారు. కోరుకొండ మెమోరియల్ ట్రస్టు పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన ఇంటి ముందు సైతం పేద విద్యార్థులకు చదువు చెప్పించబడును అనే బోర్డు ఏర్పాటు చేశారు.