AP Capital Report: రాజధానిపై రిపోర్ట్ వచ్చేసింది, సీఎం వైయస్ జగన్‌కు నివేదిక ఇచ్చిన జీఎన్ రావు కమిటీ, డిసెంబర్ 27న ఏపీ కేబినెట్ భేటీ, ఆ తర్వాత ఏపీ రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారిన రాజధానికి సంబంధించిన జీఎన్ రావు రిపోర్టు (GN Rao Committee) ఎట్టకేలకు సీఎం జగన్ (AP CM YS Jagan) చెంతకు చేరింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో..కమిటీ సభ్యులు జగన్‌ను కలిశారు. తమ నివేదికను సీఎం జగన్ కి అందచేశారు. రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సూచనలు ఇవ్వడం కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జీఎన్ రావు అధ్యక్షతన నిపుణుల కమిటీని జగన్ సర్కారు సెప్టెంబర్ 13న ఏర్పాటు చేసిన సంగతి విదితమే.
Amaravathi, December 20: ఏపీ రాజధానిపై అతి త్వరలోనే సస్పెన్స్ వీడబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారిన రాజధానికి సంబంధించిన జీఎన్ రావు రిపోర్టు (GN Rao Committee) ఎట్టకేలకు సీఎం జగన్ (AP CM YS Jagan) చెంతకు చేరింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో..కమిటీ సభ్యులు జగన్‌ను కలిశారు. తమ నివేదికను సీఎం జగన్ కి అందచేశారు. రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సూచనలు ఇవ్వడం కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జీఎన్ రావు అధ్యక్షతన నిపుణుల కమిటీని జగన్ సర్కారు సెప్టెంబర్ 13న ఏర్పాటు చేసిన సంగతి విదితమే.
ఈ కమిటీ అక్టోబర్ మూడో వారం నుంచి పని ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడంతోపాటు expertcommittee2019@gmail.com ద్వారానూ అభిప్రాయాలను సేకరించింది. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గతంలో ప్రకటించారు. ఈ కమిటీ పూర్తి నివేదిక ఇవ్వకముందే మూడు రాజధానులు ఉండొచ్చంటూ అసెంబ్లీలో జగన్ సంకేతాలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని 'అమరావతి'ని తరలిస్తున్నారా? వైసీపీ నేతల కీలక వ్యాఖ్యలు
డిసెంబర్ 27న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. మంత్రివర్గ సమావేశంలో జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం చర్చిస్తుందని సమాచారం. కేబినెట్ ఆమోదించిన తర్వాతే నివేదికను బహిర్గతం చేస్తారని వార్తలు వస్తున్నాయి.
ఏపీకి 3 రాజధానుల అవసరం ఉంది, బహుశా 3 రాజధానులు వస్తాయేమోనన్న ఏపీ సీఎం వైయస్ జగన్
ఈ రిపోర్ట్ ఆధారంగానే సీఎం జగన్ మూడు రాజధానులు ఉంటాయనే సంకేతాలు ఇచ్చారేమో అనే వాదన కూడా ఉంది. తాజాగా జీఎన్ రావు కమిటీ పూర్తిస్థాయి నివేదికను సీఎంకు సమర్పించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏం చర్యలు తీసుకోవాలో ఈ కమిటీ నివేదికలో పేర్కొంది.