IPL Auction 2025 Live

Krishna Water Dispute: కేసీఆర్ సర్కార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది, జీవో నెంబర్ 34 ను రద్దు చేయండి, తెలంగాణ వైఖరిపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌, కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని విజ్ఞప్తి

ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ (Telangana) గండి కొడుతోందని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ సందర్భంగా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి ( Supreme Court) విజ్ఞప్తి చేసింది.

Supreme Court of India | (Photo Credits: IANS)

Amaravati, July 14: కృష్ణా జలాల పంపిణీ మీద తెలంగాణ అనుసరిసున్న వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ (Telangana) గండి కొడుతోందని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ సందర్భంగా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి ( Supreme Court) విజ్ఞప్తి చేసింది.

అదే విధంగా... తెలంగాణ సర్కార్ జూన్‌ 28న ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు.. ‘‘తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తాగు, సాగు నీటి జలాలు దక్కకుండా ప్రజల హక్కును హరిస్తోంది. కృష్ణా జలాల పంపిణీ (Krishna Water Dispute) అవార్డును తెలంగాణ ఉల్లంఘిస్తోంది. విభజన చట్టాన్ని కూడా తెలంగాణ ఉల్లంఘిస్తోంది’’ అని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది.

శ్రీశైలం ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్నా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని తెలిపింది. నీటి లభ్యత తక్కువగా ఉన్నా కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. ఏపీ ప్రజాలకు తీవ్ర నష్టం చేకూరుస్తోందని పిటిషన్‌లో తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని, ఏపీ ప్రజల జీవించే హక్కు హరించటమేనని తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలను, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు అమలు చేయడం లేదని ఫిర్యాదు చేసింది.

తెలంగాణలో ఏటా కొలువుల జాతర, వార్షిక నియామక క్యాలెండర్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్, నేడు మళ్లీ మంత్రి వర్గ సమావేశం

తెలంగాణలో విద్యుత్ కేంద్రాల్లో వంద శాతం ఉత్పత్తి చేయాలంటూ కేసీఆర్ సర్కారు జూన్ 28వ తేదీన జీవో నెంబర్ 34 విడుదల చేసింది. దీనిపై ఇప్పటికే ఏపీ రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా జీవో నెంబర్ 34 తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిందంటూ పిటిషనర్లు అభ్యంతరం తెలిపారు. సాగునీటికి ఉపయోగించాల్సిన నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అలా చేయడం ద్వారా నీరు నిరుపయోగంగా సముద్రం పాలవుతుందని పిటిషనర్లు తెలిపారు.



సంబంధిత వార్తలు

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

KTR: రాహుల్ గాంధీ తిట్టడంతోనే వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి...అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ ఫైర్, చిట్టినాయుడు చిప్ దొబ్బిందని ఎద్దేవా చేసిన కేటీఆర్

Harishrao: వాంకిడి బాధితులను పరామర్శించడం తప్పా?, రాజ్యాంగ దినోత్సవం రోజే హక్కుల ఉల్లంఘనా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్