Telangana CM KCR | File Photo

Hyderabad, July 14: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ చేపట్టడానికి వీలుగా వార్షిక నియామక క్యాలెండర్‌ (జాబ్‌ క్యాలెండర్‌) ను (Annual recruitment calendar) రూపొందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏటా విధిగా ఉద్యోగ నియామకాలు (Govt jobs to be filled)చేపట్టాలని అధికారులను ఆదేశించింది. మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet Meeting) ఉద్యోగాల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపుతోపాటు పలు అంశాలపై చర్చించింది.

ఉద్యోగ నియామకాలు, ఖాళీల గుర్తింపు, జాబ్‌ క్యాలెండర్‌ నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకొనేందుకు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశం కావాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి వరుసగా రెండోరోజు బుధవారం మంత్రివర్గ సమావేశం కొనసాగనున్నది. ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులు పూర్తి వివరాలతో హాజరుకావాలని మంత్రివర్గ సమావేశం ఆదేశించింది.

జూలై 19 నుంచి గాంధీ ఆస్పత్రిలో నాన్‌కోవిడ్‌ సేవలు, కోవిడ్, బ్లాక్‌ఫంగస్‌ వార్డులు ఏర్పాటు చేస్తామని తెలిపిన గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు

ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియ సత్వరమే చేపట్టాలని అధికారులకు క్యాబినెట్‌ స్పష్టంచేసింది. అన్ని రకాల పోస్టుల్లో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్‌ కోసం ‘వార్షిక నియామక క్యాలెండర్‌’ ను తయారుచేయాలని ఆదేశించింది. వార్షిక నియామకాల క్యాలెండర్‌ రూపకల్పనకు ఆమోదం లభించడంతో.. ఉద్యోగాల నియామకాలపై ఎప్పటికప్పుడు ఒక స్పష్టత వస్తుంది. ఎప్పుడు ఏయే ఉద్యోగాలను భర్తీచేస్తారో, రాత పరీక్షలు ఎప్పుడు ఉంటాయో ఈ క్యాలెండర్‌లో సమగ్రంగా పొందుపరుస్తారు. ఒకేసారి పదుల నోటిఫికేషన్లు జారీకావడం, పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం చాలకపోవడం వంటి సమస్యలకు ఇకపై పరిష్కారం లభించనున్నది.

నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నా సీఎం కేసీఆర్ మొద్దునిద్ర వీడటం లేదు, వెంటనే ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి, వనపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిళ, తెలంగాణ ముఖ్యమంత్రిపై విమర్శలు ఎక్కుపెట్టిన వైయస్సార్టీపీ అధినేత్రి

దేశవ్యాప్తంగా యూపీఎస్సీ నిర్వహించే మాదిరిగానే తెలంగాణలోనూ జాబ్‌ క్యాలెండర్‌ను అమలుచేయనున్నారు. ఇందులో భాగంగా ఏడాది కాలంలో భర్తీచేసే పోస్టుల వివరాలు, పరీక్ష తేదీ, పరీక్షల విధానం, సిలబస్‌, సూచనలు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం సహా మరికొన్ని వివరాలుండనున్నట్లు తెలుస్తున్నది. దీని ప్రకారం ప్రతి ఏటా జనవరిలో వార్షిక ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదలచేస్తారు. ఏ నెలలో ఏ తేదీలలో ఏయే ఉద్యోగాలను భర్తీచేయనున్నారో, ఆ వివరాలను అందులో పొందుపరుస్తారు. కేరళలోనూ ఇదే తరహాలో వార్షిక ఉద్యోగాల క్యాలెండర్‌ను అమలుచేస్తున్నారు. అక్కడ ఉద్యోగి పదవీ విరమణకు 6 మాసాల ముందుగానే ఆ ఉద్యోగాన్ని ఖాళీగా నోటిఫై చేసి, భర్తీచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తరహా క్యాలెండర్‌ను ప్రభుత్వం గత జనవరిలో ప్రకటించింది.

రాష్ట్రంలో ప్రస్తుతమున్న పోస్టులను 33 జిల్లాలవారీగా పునః కేటాయించాలని ఉన్నతాధికారులను క్యాబినెట్‌ ఆదేశించింది. ఆ మేరకు అధికారులు- ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను సత్వరమే చేపట్టాలని స్పష్టంచేసింది. తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించి, కొత్త జిల్లాలు- కొత్త జోన్లు వచ్చినప్పటికీ ఉద్యోగులు దాదాపుగా ఎక్కడివారక్కడే పని చేస్తున్నారు. సమూల ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్డర్‌ టు సర్వ్‌ (తాత్కాలిక) ప్రాతిపదికన ఉద్యోగులతో సేవలు పొందింది. ఇది పూర్తయితే ఆర్డర్‌ టు సర్వ్‌ పద్ధతి పూర్తిగా రద్దవుతుంది.