YS Sharmila: నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నా సీఎం కేసీఆర్ మొద్దునిద్ర వీడటం లేదు, వెంటనే ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి, వనపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిళ, తెలంగాణ ముఖ్యమంత్రిపై విమర్శలు ఎక్కుపెట్టిన వైయస్సార్టీపీ అధినేత్రి

తెలంగాణలో వెంటనే ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిళా రెడ్డి ( YS Sharmila) నిరహార దీక్ష చేపట్టారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం తాటిపర్తి గ్రామంలో ఈరోజు ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష (Demands Jobs for Unemployed) చేపట్టారు.

YS Sharmila: నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నా సీఎం కేసీఆర్ మొద్దునిద్ర వీడటం లేదు, వెంటనే ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి, వనపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిళ, తెలంగాణ ముఖ్యమంత్రిపై విమర్శలు ఎక్కుపెట్టిన వైయస్సార్టీపీ అధినేత్రి
YS Sharmila (Pic Credit: IANS/ Twitter )

Hyderabad, July 13: తెలంగాణలో వెంటనే ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిళా రెడ్డి ( YS Sharmila) నిరహార దీక్ష చేపట్టారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం తాటిపర్తి గ్రామంలో ఈరోజు ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష (Demands Jobs for Unemployed) చేపట్టారు. ఈ సంధర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై (CM KCR) వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో అత్యధికంగా నిరుద్యోగులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని... అయినా కేసీఆర్ మొద్దునిద్రను వీడటం లేదని అన్నారు.

నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నా దున్నపోతుపై వాన పడినట్టు కేసీఆర్ తీరు ఉందని దుయ్యబట్టారు. ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దీక్ష ప్రారంభానికి ముందు ఆత్మహత్యకు పాల్పడిన కొండల్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు అంటూ ప్రకటన చేసిన కేసీఆర్... ఇదే సమయంలో 50 వేల మంది ఉద్యోగులను పీకేశారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాసి దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్షలు చేపడతామని చెప్పారు.

(The above story first appeared on LatestLY on Jul 13, 2021 04:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).