Pension Distribution in Andhra Pradesh: పెన్సన్ ఇంటికి రాదేమోననే భయంతో ఇద్దరు గుండెపోటుతో మృతి, పెన్సన్ల పంపిణీపై మార్గదర్శకాలు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఏపీలో పెన్షన్ పంపిణీ ఆలస్యం అవుతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొంది.

Andhra pradesh : Pensions distributed to beneficiaries at doorstep (photo-Facebook)

VJY, April 2: ఏపీలో ఇప్పుడు పెన్సన్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఏపీలో పెన్షన్ పంపిణీ ఆలస్యం అవుతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల వల్లే సకాలంలో పెన్షన్లు అందించలేకపోయామని వైసీపీ ఆరోపించింది.

తాజాగా పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తాజాగా జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. పెన్షన్ పంపిణీకి అనుసరించాల్సిన విధానాలపై వారితో చర్చించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ చేపట్టాలని, ఎండల తీవ్రత నేపథ్యంలో అక్కడ టెంట్లు, తాగునీరు సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

వాలంటీర్ల సేవలకు ఎన్నికల కమిషన్ బ్రేక్‌ వేయడంతో పెన్షన్ పంపిణీ రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్షాల వల్లే పెన్షన్లు అందించడం ఆలస్యం అవుతోందని వైసీపీ సర్కారు ఆరోపించింది. వాలంటీర్లను తప్పించేందుకు కారణమైన టీడీపీ, జనసేన పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని వైసీపీ ప్రజలకు పిలుపునిచ్చింది. అయితే వాలంటీర్లను సొంత ప్రయోజనాలకు వాడుకోవడం వల్లే ఈసీ వేటు వేసిందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మచిలీపట్నంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు, ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని ఆవేదన

అసలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వ ఖజానాలో నిధులు ఉన్నప్పుడు కదా పంపిణీ గురించి ఆలోచించేదని విపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. ఖజనా మొత్తం ఖాళీ చేసి పెన్షన్లు ఇవ్వలేక, తప్పించుకోవడానికి ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని అంటున్నారు. కాగా, వాలంటీర్ల వ్యవస్థను గతంలో విచ్చిన్నం చేయాలన్న పార్టీలే ఇప్పుడు ప్రశంసిస్తూ మాట్లాడుతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు.

Here's YSRCP Tweet

ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు ఏపీలో వాలంటీర్ల (Volunteers) ద్వారా కాకుండా సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేపట్టాలని సెర్ప్‌ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌(Election Code) అమలులోకి రావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెర్ప్‌ అధికారులు ( SERP officials) తెలిపారు.  విజయవంతంగా నాలుగో రోజు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ...సీఎం జగన్ తో ముఖాముఖి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న తుగ్గులి, రాతన గ్రామ ప్రజలు

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయంలో పింఛన్లు పంపిణీ చేయాలని ఎన్నికల కోడ్‌ వల్ల వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయవద్దని సూచించారు. ఎన్నికల కోడ్‌ ముగిసేవరకు ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని, పింఛన్‌(Pensions) లబ్దిదారులు ఆధార్‌, లేదా ఇతర గుర్తింపు కార్డు సచివాలయానికి తీసుకెళితే వాటిని సచివాలయ సిబ్బంది పరిశీలించి అందజేస్తారని వివరించారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇప్పటి వరకు పింఛన్లతో పా పలు కార్యక్రమాలు చేస్తుంది. ఎన్నికల సందర్భంగా వాలంటీర్లు ఓటర్లు ప్రభావితం చేయవచ్చని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లడంతో వాలంటీర్లను పక్కన పెట్టింది.

కాకినాడ రూరల్ తూరంగిలో ఫించన్ అందలేదన్న బాధతో ఓ వృద్ధుడు గుండె ఆగి మరణించాడు. కే. వెంకట్రావ్(70) అనే వ్యక్తికి వాలంటీర్‌ వ్యవస్థ మూగ బోయ్యిందన్న సమాచారం తెలియదు. దీంతో తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. ఈ క్రమంలో తానే స్వయంగా సచివాలయానికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకున్నాడు. మార్గం మధ్యలోనే గుండెపోటుకి గురై కన్నుమూశాడు. వెంకట్రావ్ మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. అంతేకాదు.. వెంకట్రావ్ మృతి చెందిన విషయాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంకట్రావ్‌ మృతిపై చలించిపోయిన సీఎం జగన్‌.. వెంకట్రావ్‌ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు.

తిరుపతిలో జిల్లా వెంకటగిరి బంగారుపేటలో 80 ఏళ్ల వృద్ధుడు వెంకటయ్య మృతి చెందాడు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్‌ను ఇవ్వరన్న మనస్తాపంతో గుండెపోటుతో అక్కడికక్కడే వెంకటయ్య కుప్పకూలిపోయాడు. ఇదిలా ఉంటే చంద్రబాబు, పవన్, బీజేపీ తీరుపై మనస్తాపానికి గురై పలువురు వాలంటీర్లు ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

పేదలకు ఇచ్చే పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుకోవడం తమను బాధించిందన్నారు. ఒకటో తేదీ ఉదయం నుంచే తమకు పలువురు ఫించన్‌ కోసం ఫోన్లమీద ఫోన్లు చేస్తూ ఆరా తీస్తున్నారని, తమకు ముందులా తాము బాధపడాల్సిన పరిస్థితులొచ్చాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వాలంటీర్లు అంటున్నారు.

ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు.ఇంటింటికీ ఫించన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫించన్ల పంపిణీకి ఈసీ ఎలాంటి ఆంక్షలు విధించలేదని, వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచే అందించాలని సూచించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే ఫించన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్న సిటిజన్ ఫర్ డెమొక్రసీ వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. వాలంటీర్లను సంక్షేమ పథకాల పంపిణీ నుంచి తప్పించాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో ఇప్పుడు వైసీపీ నేతలు మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్థితుల్లో ఉందని మాజీ ఎస్ఈసీ, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) తెలిపిన సంగతి విదితమే.