Jagananna Chedodu Scheme: నేడు జగనన్న చేదోడు స్కీమ్ లాంచ్, కుల వృత్తుల వారికి ఏడాదికి రూ.10 వేలు, రూ.154 కోట్ల 31 లక్షలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ఈ పథకం కింద ప్రభుత్వం అందజేయనుంది. వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయీబ్రాహ్మణ, టైలర్(దర్జీ) సంక్షేమం కోసం ‘జగనన్న చేదోడు’ (Jagananna Chedodu Scheme) పేరుతో ఆర్థిక సహాయం అందించనున్నారు.
Amaravati, June 10: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) నేడు జగనన్న చేదోడు పథకాన్ని లాంచ్ చేయనున్నారు. షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ఈ పథకం కింద ప్రభుత్వం అందజేయనుంది. వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయీబ్రాహ్మణ, టైలర్(దర్జీ) సంక్షేమం కోసం ‘జగనన్న చేదోడు’ (Jagananna Chedodu Scheme) పేరుతో ఆర్థిక సహాయం అందించనున్నారు. ఏపీలో నాలుగు వేలకు చేరువలో కోవిడ్-19 కేసులు, తాజాగా 147 కరోనా కేసులు నమోదు, 2403 మంది డిశ్చార్జ్
సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకానికి రూ.154 కోట్ల 31 లక్షలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందనుంది. ఈ డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌లతో మాట్లాడి లబ్దిదారుల అన్‌ఇన్‌కంబర్డ్ అకౌంట్లకు ఈ నగదు జమ చేయనున్నారు
షాపులున్న1,25,926 మంది టైలర్లకు రూ. 125,92,60, 82,347 మంది రజకులకు రూ. 82,34,70, 38,767 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 38,76,70 మొత్తం 2,47,040 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. ఈ లబ్దిదారులు వారి వృత్తికి అవసరమగు చేతి పనిముట్లు, చేతి పెట్టుబడి కోసం ఈ ఆర్దిక సాయాన్ని వినియోగించుకుని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.