HC On Vizag Steel Plant Privatization: ఏ చట్టం కింద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారు, కేంద్రాని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు, సీఎం జగన్ లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఏ చట్ట నిబంధనలను అనుసరించి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.
Vjy, April 4: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఏ చట్ట నిబంధనలను అనుసరించి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అసలు ఏ చట్టం కింద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ప్రైవేటీకరణకు అనుమతించే చట్టం ఏదైనా ఉందా? ప్రైవేటీకరణకు ముందు ఆ కర్మాగారం ఉద్యోగులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇతర లబ్దిదారులను సంప్రదించారా? ఈ విషయాలన్నింటిపై మీ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రూ.8 వేల కోట్లు అయినా, రూ.42 వేల కోట్లైనా నేను కొంటా, విశాఖ ఉక్కుపై హైకోర్టులో కేఏ పాల్ పిల్, తెలుగు తెలిసిన విశ్రాంత న్యాయమూర్తి నియమించాలని సూచన
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందించకపోవడం ఎంత మాత్రం సరికాదంది. ముఖ్యమంత్రి రాసిన లేఖపై స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పింది. సీఎం లేఖ రాస్తే దానిని పక్కన పెట్టి నిద్రపోవడానికి వీల్లేదని, సీఎం లేఖను గౌరవించాలని తేల్చి చెప్పింది. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం, పెన్సన్ల పంపిణీపై ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు
విశాఖ ఉక్కు నిర్వహణకు కావాల్సిన నిధులు విదేశాల నుంచి తెచ్చేందుకు, ఫెరా చట్టం కింద ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరిచేందుకు అనుమతించాలని కోరుతూ కేఏ పాల్ ఇచ్చిన వినతిపై ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్‌లో ఎక్కడా ముఖ్యమంత్రి రాసిన లేఖ గురించి, దానిపై తీసుకున్న చర్యల గురించి కేంద్రం ప్రస్తావించలేదని ఆక్షేపించింది. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వివిధ వర్గాలు ఇచ్చిన భూమిని విక్రయించే విషయంలో పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి కీలక ప్రకటన, ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన మోదీ సర్కారు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో పాటు సువర్ణరాజు తదితరులు వేర్వేరుగా ‘పిల్స్’ దాఖలు చేశారు. రేషన్‌కార్డుదారులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ కూడా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ శేషసాయి ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది.
సొంత నిధులతో కొనుగోలు చేసిన భూమి మాత్రమే విక్రయిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ తరపు లాయర్ వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 24కి వాయిదా వేసింది.ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవైటీకరణ ప్రక్రియలో మరో ముందడుగు? ప్రైవేటీకరణ సాధ్యాసాధ్యాలపై అధ్యయన కమిటీని నియమించిన కేంద్రం, ఆందోళనలు లెక్కచేయకుండా పనులు మరింత వేగవంతం!
ధర్మాసనం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) తరఫు న్యాయవాదిని ఈ విషయంపై వివరణ కోరింది. ప్రైవేటీకరణ నిజమేనా? భూములు అమ్ముతున్న మాట వాస్తవమేనా? అని ప్రశ్నించింది. ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని ఆర్‌ఐఎన్‌ఎల్ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ నివేదించారు.
ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో వేటినీ అమ్మడం లేదన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్ తన సొంత నిధులతో కొనుగోలు చేసిన 25 ఎకరాలను మాత్రమే విక్రయించనున్నట్లు తెలిపారు. దీంతో ధర్మాసనం వివేక్ చెప్పిన వివరాలను రికార్డ్ చేసింది. మరో న్యాయవాది వై.కోటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని, యథాతథస్థితి కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్ధించారు.
ఆ 25 ఎకరాలు కాకుండా సేకరించిన మిగిలిన భూముల సంగతి ఏమిటి? ఆ భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి? అసలు విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్ర తెలుసా? ఎన్ని ఉక్కు కర్మాగారాల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నారు? ఎన్ని ఆచరణలోకి వచ్చాయి? అంటూ కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ స్పందిస్తూ భూముల అమ్మకం విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన లేదన్నారు.
పిటిషనర్లది ఆందోళన మాత్రమేనన్నారు. ఏం చేసినా పారదర్శకంగా చేస్తామని, పత్రికా ప్రకటన ఇస్తామని చెప్పారు. దీంతో అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించగా మూడు వారాల్లో అందచేస్తామని రుద్ర నివేదించారు. నిధులు తెచ్చే విషయంలో ఏమైనా వినపతిత్రం ఇచ్చారా? అని ధర్మాసనం ప్రశ్నించగా మార్చిలో అందచేసినట్లు కేఏ పాల్ పేర్కొన్నారు. ఆ వినతిపై ఏ చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)