Andhra Pradesh: మేము కంపెనీ సెక్రటరీలం కాదు, హైకోర్టు జడ్జీలం, రఘురామకృష్ణరాజు పిల్‌పై మండిపడిన ఏపీ హైకోర్టు, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని వెల్లడి
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు చెల్లించే పన్నులను ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు హైకోర్టు (AP High court) మొటిక్కాయలు వేసింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు మీరెవరంటూ నిలదీసింది.
Amaravati, June 16: ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు చెల్లించే పన్నులను ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు హైకోర్టు (AP High court) మొటిక్కాయలు వేసింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు మీరెవరంటూ నిలదీసింది. అసలు ఈ వ్యాజ్యం నిరర్థకమైందని, ఈ వ్యాజ్యాన్ని తామెందుకు విచారించాలని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యాజ్యాన్ని (High court dismisses rebel MP’s PIL) దాఖలు చేశారని రఘురామకృష్ణరాజును ఉద్దేశించి.. ఘాటుగా వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపేందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు అనిపిస్తోందని మండిపడింది. రుణం పొందకుండా ప్రభుత్వ యత్నాలను అడ్డుకోవాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని పునరుద్ఘాటించింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు ఎలా సాగాలో చూసేందుకు తామేమీ కంపెనీ సెక్రటరీలం కాదని, హైకోర్టు జడ్జీలమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలను న్యాయస్థానాలు నడిపించలేవని పేర్కొంది. ఫలానా విధానంలోనే రుణం పొందాలని మీరెలా చెబుతారని పిటిషనర్, వైసీపీ ఎంపీ రఘురామరాజును ప్రశ్నించింది.
న్యాయమూర్తులుగా తామేం చేయాలో రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందని, దాని ప్రకారమే నడుచుకుంటామని తేల్చి చెప్పింది. ప్రభుత్వాలను తాము నడపడం లేదని, ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాదని పేర్కొంది. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వం నుంచి కనీస వివరణ కూడా కోరబోమని స్పష్టం చేసిన ధర్మాసనం దీనిపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాము జారీ చేయబోయే ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని ధర్మాసనం ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజుకు తేల్చి చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగా ఉందో లేదో ఆర్‌బీఐ, కాగ్ చూసుకుంటాయని తెలిపింది. ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ తనకు వచ్చే ఆదాయాన్ని చూపి రుణం పొందితే.. ప్రజా ప్రయోజనాలకు ఎలా భంగం కలుగుతుందని నిలదీసింది. ఈ వ్యాజ్యాన్ని పరిశీలిస్తే.. ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగించకూడదని పిటిషనర్ కోరుకుంటున్నట్లు ఉందని, సంక్షేమ పథకాలు నిలువరించడం కోసం వేసిన ఈ పిటిషన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం నిర్వచనంలోకి ఎలా వస్తుందని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో తామెందుకు జోక్యం చేసుకోవాలని వ్యాఖ్యానించింది.
ఈ తరహా వ్యాజ్యాలను ప్రోత్సహిస్తే రేపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్‌లను కూడా కోర్టుల్లో సవాల్ చేస్తారని పేర్కొంది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం స్పెషల్ మార్జిన్ పేరుతో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి.. దానిని ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించలేమని తేల్చిచెప్పింది. ఇదో నిరర్థక వ్యాజ్యమని.. ఈ వ్యవహారంలో తాము తగిన ఉత్తర్వులు ఇస్తామని.. వాటిపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సలహా ఇచ్చింది.
విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు, బైజూస్‌తో ఎంఓయూ కుదుర్చుకున్న జగన్ సర్కారు
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎ్‌సఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. మద్యం అమ్మకాల ద్వారా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయాన్ని చూపించి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు రాష్ట్రప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ చట్టం(1993)కి సవరణ చేస్తూ తీసుకొచ్చిన సవరణ చట్టాల(యాక్ట్ 31/2021, యాక్ట్ 9/2022)ను సవాల్ చేస్తూ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపించారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమయ్యే మొత్తం సొమ్ములో 25శాతానికి మించి ప్రభుత్వం అప్పు చేయడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికే రుణపరిమితికి మించి అప్పులు చేసిందని.. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్ పేరుతో బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి.. ఆ ఆదాయాన్ని తనఖా పెట్టి రుణం పొందుతోందన్నారు.
కార్పొరేషన్ తాజాగా రూ.8 వేల కోట్ల రుణం పొందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి చేసిన అప్పులపై కేంద్రం ఇప్పటికే వివరణ కోరిందని చెప్పారు. సంక్షేమ పథకాలను అడ్డుకోవాలన్నది తమ ఉద్దేశం కాదన్నారు. రాష్ట్రప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు కోర్టులు జోక్యంచేసుకోవచ్చని తెలిపారు. పన్నుల రూపేణా వచ్చే ఆదాయాన్ని బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించడానికి వీల్లేదన్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)