Teachers Transfer Row: టీచర్ల బదిలీల సంగతి ప్రభుత్వం చూసుకుంటుంది..మీకెందుకు? బీసీ సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిల్‌పై మండిపడిన ఏపీ హైకోర్టు, పిల్‌ను ఉపసంహరించుకున్న న్యాయవాది

ఇందులో భాగంగానే ఏపీ బీసీ సంక్షేమ సంఘం.. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఫలానా విధంగా చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు మండిపడింది. ఉపాధ్యాయుల బదిలీలకు, మీ సంఘానికి అసలు సంబంధం ఏమిటని ప్రశ్నించింది.

File image of High Court of Andhra Pradesh | File Photo

Amaravati, Dec12; ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఏపీ బీసీ సంక్షేమ సంఘం.. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఫలానా విధంగా చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు మండిపడింది. ఉపాధ్యాయుల బదిలీలకు, మీ సంఘానికి అసలు సంబంధం ఏమిటని ప్రశ్నించింది.

గత విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తిచేసి బదిలీల ప్రక్రియ చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బి.చిరంజీవి హైకోర్టులో ఈ పిల్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ దొనడి రమేశ్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.నాగేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ఏడాది నవంబర్‌ నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను బదిలీ చేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ఉపాధ్యాయుల బదిలీలతో పిటిషనర్‌కు ఏంపని అని ప్రశ్నించింది.

రైతుల ఆదాయం రెట్టింపు అవ్వాలి, బ్యాంకులు ప్రధానంగా దీనిపై దృష్టి సారించాలి, 213వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఏపీ సీఎం వైయస్ జగన్

బదిలీల సంగతి ప్రభుత్వం చూసుకుంటుందని, అభ్యంతరాలుంటే టీచర్లే కోర్టుకొచ్చి పోరాడే పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొంది. బదిలీలతో సంబంధం లేని బీసీ సంక్షేమ సంఘం పిల్‌ దాఖలు చేయడం పరిధి దాటి వ్యవహరించడమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. బీసీ సంక్షేమ సంఘం పేరుతో ప్రతి వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. దీంతో పిటిషనర్‌ న్యాయవాది పిల్‌ను ఉపసంహరించుకున్నారు.



సంబంధిత వార్తలు