Anandaih K Medicine: ఆనందయ్య కె మందుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్, తక్షణమే కె మందును పంపిణీ చేయాలంటూ ఆదేశాలు, కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక అందించాలని ప్రభుత్వానికి సూచించిన ధర్మాసనం
గతంలో ఆనందయ్య కె మందును ప్రభుత్వం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు తక్షణమే కె మందును పంపిణీ చేయాలంటూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
Nellore, June 7: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కె మందుకు (Anandaih K Medicine) ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆనందయ్య కె మందును ప్రభుత్వం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు తక్షణమే కె మందును పంపిణీ చేయాలంటూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక అందించాలని ధర్మాసనం (andhra Pradesh high court) సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. కాగా.. నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభమైంది. కంట్లో వేసే మందుకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉన్నాయంటూ గతంలో ఏపీ ప్రభుత్వం కె మందుకు అనుమతిని ఇవ్వలేదు. ఈ మందును కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్... మందులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చాయి. సీసీఆర్‌ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని నివేదికలు తేల్చాయి