Covid in AP: ఏపీలో భారీగా పెరుగుతున్న డిశ్చార్జ్ రేటు, 24 గంటల్లో 12,292 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి, కొత్తగా 8,766 మందికి కోవిడ్ పాజిటివ్, ప్రస్తుతం 1,03,995 యాక్టివ్‌ కేసులు

ఇప్పటివరకు రాష్ట్రంలో 17,76,878 మందికి కరోనా వైరస్‌ (Covid in Andhra Pradesh) సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 67 మంది (Covid Deaths) మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,696కు చేరింది.

A resident gets tested for coronavirus in the Liwan District in Guangzhou in southern China (Photo: PTI)

Amaravati, June 9: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 93,511 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,766 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ (Andhra Pradesh logs 8766 new Covid cases) అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 17,76,878 మందికి కరోనా వైరస్‌ (Covid in Andhra Pradesh) సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 67 మంది (Covid Deaths) మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,696కు చేరింది.

గడిచిన 24 గంటల్లో 12,292 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 16 లక్షల 64 వేల 082 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 1,03,995 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,00,39,764 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

కొత్తగా చిత్తూరు జిల్లాలో 11, తూర్పుగోదావరి జిల్లాలో, విశాఖ జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. ప్రకాశంలో ముగ్గురు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

ప్రమాదంలో కుటుంబ పెద్ద మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు సాయం, జులై 1 నుంచి వైఎస్ఆర్ బీమా అమలు చేయాలని అధికారులకు అదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం, జూలై 8వ తేదీన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ప్రారంభం

కరోనా కట్టడిలో.. వ్యాక్సిన్‌ పంపిణీలో ఏపీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కరోనా పరీక్షలు ఇప్పటివరకు 2 కోట్ల మందికిపైగా చేసినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్ తెలిపారు. ఏపీలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయని చెప్పారు. అమరావతిలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏకే సింఘాల్‌ మీడియాతో మాట్లాడారు.

AP Covid Report

మే 16వ తేదీన పాజిటివిటీ రేటు 25.56% ఉండగా ప్రస్తుతం 9.37%గా ఉందని, రెట్టింపు స్థాయిలో పాజిటివ్‌ రేటు తగ్గిందని వివరించారు. ఇప్పటివరకు 1.09 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించారు. జులై 10వ తేదీ నాటికి ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ పూర్తి చేస్తామని ఏకే సింఘాల్‌ ప్రకటించారు

ఏపీలోనే అత్యధికంగా ప్రాజెక్టులు, గత రెండేళ్లలో రూ.34,002 కోట్ల విలువైన ప్రాజెక్టులు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపిన ఐటీ మంత్రి గౌతం రెడ్డి, మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి

రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చెప్పారు. ఇప్పటివరకు 45 ఏళ్ల వయసు పైన వారికే వ్యాక్సిన్‌ వేస్తున్నామన్నారు. కానీ చిన్నారుల్లో కరోనా వచ్చినప్పుడు తల్లి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లులకు కూడా టీకా వేస్తే రక్షణ ఉంటుందని చెప్పారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు