Vijayawada Shocker: విజయవాడలో మహిళ స్నానం చేస్తుండగా దొంగ చాటుగా ఫోటోలు, ఏడాది నుంచి బెదిరిస్తూ అత్యాచారం, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

ఓ మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా ఆమె ఫొటోలు తీసి ఏడాదిగా బెదిరింపులకు పాల్పడ్డాడు. లక్షల్లో డబ్బులు గుంజుతూ ఏడాదిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.అతడి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో తాజాగా ఆమె తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది

Credits: Google

VJY, Mar 3: విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా ఆమె ఫొటోలు తీసి ఏడాదిగా బెదిరింపులకు పాల్పడ్డాడు. లక్షల్లో డబ్బులు గుంజుతూ ఏడాదిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.అతడి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో తాజాగా ఆమె తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

విజయవాడ పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. నగరంలోని విశాలాంధ్ర కాలనీకి చెందిన పుట్టా సుభాష్ (45) బీపీసీఎల్ కంపెనీలో పైపులైన్ సెట్టింగ్ చేసే కార్మికుడుగా పని చేస్తున్నాడు. రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ (35) శాంతినగర్‌లో భర్తతో కలిసి చిన్న కిరాణం దుకాణం నిర్వహిస్తోంది. పలుమార్లు ఆ దుకాణంలో సరుకులు కొనుగోలు చేసిన సుభాష్ పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించాడు. ఈ క్రమంలో ఆమె నంబరు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో ఓ రోజు ఆమె స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫొటోలు తీశాడు.

ప్రమోషన్ కోసం భర్త పాడు పని, బాస్ పక్కలో పడుకోవాలంటూ భార్యకు వేధింపులు, కోర్టును ఆశ్రయించిన బాధితురాలు

వాటిని ఆమెకు చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. తన మాట వినకపోతే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాదిపాటు ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా రూ. 16 లక్షల నగదు తీసుకున్నాడు. ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఆమెపై దాడిచేశాడు. ఇటీవల అతడి ఆగడాలు మితిమీరడంతో కుటుంబ సభ్యులతో కలిసి సుభాష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.



సంబంధిత వార్తలు

Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్

Cyclone Fengal: తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్టాలిన్ సర్కారు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్