Andhra Pradesh: మేకపాటి గౌతమ్‌రెడ్డి శాఖలు ఇతర మంత్రులకు కేటాయింపు, మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమల శాఖ, మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ

మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్‌ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్‌, ఎన్ఆర్ఐ ఎంపవర్‌మెంట్ కేటాయించారు.

CM YS Jagan (Photo-Twitter/AP CMO)

Amaravati, Mar 3: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సంబంధించిన శాఖలను ( Mekapati Goutham Reddy's portfolios) ఇతర మంత్రులకు కేటాయించారు. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్‌ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్‌, ఎన్ఆర్ఐ ఎంపవర్‌మెంట్ కేటాయించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల వ్యవహారాలను సదరు మంత్రులు చూడనున్నారు.

పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గత సోమవారం గుండెపోటుతో మరణించారు. దాంతో అసెంబ్లీ సమావేశాల ( AP assembly sessions) సందర్భంగా ఆయన చూసిన శాఖల వ్యవహారాలను కొత్తగా కేటాయించిన మంత్రులు చూసుకుంటారు. మార్చి 7న ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ముందే గౌతమ్‌రెడ్డి చూసిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ, ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు..

దీంతో అసెంబ్లీలో ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు, చర్చలో పాల్గొనేందుకు మంత్రులకు వీలుంటుంది. మరోవైపు ఆత్మకూరు ఉప ఎన్నికకు ముందు గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యుల్లో ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం

Actress Disha Patani's Father Duped: నటి దిశాపటానీ తండ్రికి షాక్.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు మోసం చేసిన ముఠా.. ఐదుగురిపై కేసు నమోదు

Railway Shock To Reel Creators: రీల్స్ క్రియేట‌ర్ల‌కు రైల్వే శాఖ బిగ్ షాక్! ఇక‌పై ట్రైన్లు, రైల్వే ట్రాక్స్, స్టేష‌న్ల‌లో రీల్స్ చేస్తే నేరుగా ఎఫ్ఐఆర్ న‌మోదు

Telugu CM's At Maharashtra Poll Campaign: మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో తెలుగు గుభాళింపులు, మూడు రోజుల పాటూ చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి స‌హా అనేక ముఖ్య‌నేత‌ల ప్ర‌చారం