Nara Lokesh Padayatra Schedule: నారా లోకేశ్‌ పాదయాత్రకు పోలీసులు అనుమతి, షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు ప్రకటన, యువగళం పూర్తి షెడ్యూల్ ఇదే..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న ‘యువగళం’ పాదయాత్రకు (Nara Lokesh Padayatra ) పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో ప్రజలు, వాహనదారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్‌ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగించొద్దని ఎస్పీ సూచించారు.

Nara lokesh (Photo-Facebook))

Amaravati, Jan 24: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న ‘యువగళం’ పాదయాత్రకు (Nara Lokesh Padayatra ) పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో ప్రజలు, వాహనదారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్‌ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగించొద్దని ఎస్పీ సూచించారు.

ఈనెల 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ‘యువగళం’ ప్రారంభం (year-long padayatra Yuvagalam) కానుంది. పట్టణంలోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లోకేశ్‌ తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఇది కొనసాగనుంది. ఈ పాదయాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగనుంది.

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ డీజీగా ఎన్‌ సంజయ్‌, ప్రస్తుతం సీఐడీ చీఫ్‌గా ఉన్న పీవీ సునీల్‌ కుమార్‌ను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఇదిలా ఉంటే నిబంధన నోటీసును టీడీపీ నేతలు తిరస్కరించారు. నిబంధనలతో పాదయాత్ర నడపడం కష్టమని... ఏదైనా కాని పాదయాత్రకు సిద్ధమని టీడీపీ శ్రేణులు స్పష్టం చేశారు. పాదయాత్రలో ఏదైనా జరగరానిది జరిగిన దానికి పూర్తి బాధ్యత పాదయాత్ర నిర్వాహకులదే అంటూ పోలీసులు నిబంధనలో విధించినట్లు టీడీపీ శ్రేణులు వెల్లడించారు.

తిరుమలలో పటిష్ఠ నిఘా, చిన్నపాటి మైక్రో డ్రోన్‌లు కూడా పనిచేయకుండా నేవల్‌ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌, బెల్‌తో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపిన ఈవో ధర్మారెడ్డి

పాదయాత్రలో రోడ్డు లైన్ దాటి పైకి రాకూడదని నిబంధన పెట్టారు. ఇలాంటి అనేక ఆంక్షలతో కూడిన 29 షరతులతో పోలీసులు పాదయాత్రకు అనుమతిస్తూ తమకు అనుమతి ఉత్తర్వులు ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు తీసుకోకుండా నిరాకరించినట్లు వెల్లడించారు.

నారా లోకేశ్ టూర్ షెడ్యూల్:

రేపు (25వ తేదీ) మధ్యాహ్నం 1.20 గంటలకు జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్ కు లోకేశ్ బయల్దేరుతారు.

1.45 గంటలకు ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని తన తాత, టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ కు నివాళి అర్పిస్తారు.

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఘాట్ వరకు బైక్ ర్యాలీ ఉంటుంది.

మధ్యాహ్నం 2.15 గంటలకు ఎన్టీఆర్ ఘాట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళతారు.

అక్కడి నుంచి విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 3.30 గంటలకు కడపకు చేరుకుంటారు.

సాయంత్రం 5.15 గంటలకు కడప అమీన్ పీర్ దర్గాను సందర్శిస్తారు.

సాయంత్రం 6.30 గంటలకు కడపలోని రోమన్ కేథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.

అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

26వ తేదీ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు.

అనంతరం తిరుమల నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటకు కుప్పం చేరుకుంటారు.

27వ తేదీన లోకేశ్ పాదయాత్ర ప్రారంభమవుతుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now