AP Local Body Polls 2021: రెండవ విడతలోనూ వైసీపీదే దూకుడు, నామమాత్రంగా టీడీపీ హవా, రాష్ట్ర వ్యాప్తంగా 81.67 శాతం పోలింగ్ నమోదు, 539 చోట్ల సర్పంచ్ పదవులు ఏకగ్రీవం, పోలింగ్ ఎక్కువ శాతం జరిగిందని తెలిపిన డీజీపీ గౌతం సవాంగ్
Amaravati, Feb 13: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో (AP Local Body Polls 2021) రాష్ట్ర వ్యాప్తంగా 81.67 శాతం పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళం 72.87, విజయనగరం 82, విశాఖ 84.94,తూ.గో. 82.86, ప.గో.81.75, కృష్ణా 84.14, గుంటూరు 85.51, ప్రకాశం 86.93, నెల్లూరు 78.04, చిత్తూరు 77.20, వైఎస్ఆర్ జిల్లా 80.47, కర్నూలు 80.76, అనంతపురం 84.65 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు (Andhra Pradesh Panchayat Elections 2021 Phase 2) ఒక్కోక్కటిగా వెలువడుతున్నాయి.
శనివారం మధ్యాహ్నం గం. 3.30వరకూ పోలింగ్ జరగ్గా, నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. రెండో దశలో 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దాంతో రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్ జరిగింది. ఇప్పటివరకూ ఓవరాల్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 796 మంది విజయం (AP Panchayat Election Results) సాధించగా, టీడీపీ మద్దతు దారులు 50 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 2, ఇతరులు 7 చోట్ల గెలుపొందారు.
మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఏకగ్రీవాలు, విచారణ జరపాలని ఎస్ఈసీని ఆదేశించిన హైకోర్టు
పంచాయతీ ఎన్నికల్లో తొలివిడత కంటే రెండోవిడత ఎక్కువ శాతం పోలింగ్ జరిగిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. శనివారం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ..స్థానిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని డీజీపీ తెలిపారు. 2013 పంచాయతీ ఎన్నికల కంటే ఈసారి తక్కువగా అల్లర్లు జరిగిపట్లు చెప్పారు.ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకున్నారన్నారు. మూడు, నాలుగు విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేయాలని డీజీపీ సవాంగ్ తెలిపారు.ఎన్నికలు సమర్థంగా నిర్వహించిన పోలీసులకు డీజీపీ అభినందనలు తెలిపారు.
రెండో విడతలో మొత్తంగా 3,328 పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 44, టీడీపీ మద్దతు దారులు 0, బీజేపీ మద్దతుదారులు 0,ఇతరులు 0
విశాఖ: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 34 , టీడీపీ మద్దతు దారులు0, బీజేపీ మద్దతు దారులు0, ఇతరులు 0
తూర్పుగోదావరి: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 27 , టీడీపీ మద్దతు దారులు 2, బీజేపీ మద్దతు దారులు 0, ఇతరులు 0
కృష్ణా: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 39 , టీడీపీ మద్దతు దారులు 4, బీజేపీ మద్దతు దారులు 0, ఇతరులు 1
గుంటూరు: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 76 , టీడీపీ మద్దతు దారులు 7, బీజేపీ మద్దతు దారులు0, ఇతరులు 0
ప్రకాశం: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 98 ,టీడీపీ మద్దతు దారులు 4, బీజేపీ మద్దతు దారులు0, ఇతరులు 0
నెల్లూరు: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 47, టీడీపీ మద్దతు దారులు 2, బీజేపీ మద్దతు దారులు0, ఇతరులు 0
చిత్తూరు: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 75 , టీడీపీ మద్దతు దారులు 0, బీజేపీ మద్దతు దారులు1 ఇతరులు 0
అనంతపురం:వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 22 , టీడీపీ మద్దతు దారులు 1, బీజేపీ మద్దతు దారులు 0, ఇతరులు 0
కర్నూలు: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 51 , టీడీపీ మద్దతు దారులు 6, బీజేపీ మద్దతు దారులు0, ఇతరులు 0
కడప: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 37 , టీడీపీ మద్దతు దారులు 2, బీజేపీ మద్దతు దారులు 0, ఇతరులు 2
పశ్చిమగోదావరి: వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 20 , టీడీపీ మద్దతు దారులు 1, బీజేపీ మద్దతుదారులు0 ,ఇతరులు 0
విజయనగరం:వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 87 , టీడీపీ మద్దతు దారులు 3, బీజేపీ మద్దతుదారులు 0,ఇతరులు 3