AP Panchayat Elections 2021: ముగిసిన నాలుగో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్, ప్రారంభమైన ఓట్ల లెక్కింపు, రాష్ట్ర వ్యాప్తంగా చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా సాగిన పోలింగ్

మధ్యాహ్నం ఓటింగ్‌ ముగిసే సమయానికి (AP Panchayat Elections 2021) శ్రీకాకుళం 78.81, విజయనగరం 85.60, విశాఖ 84.07, తూ.గో. 74.99, ప.గో. 79.03, కృష్ణా 79.29, గుంటూరు 76.74, ప్రకాశం 78.77, నెల్లూరు 73.20, చిత్తూరు 75.68, కర్నూలు 76.52, అనంతపురం 82.26, వైఎస్‌ఆర్‌ జిల్లాలో 80.68 శాతం పోలింగ్‌ నమోదైంది.

Andhra Pradesh local Body Elections 2020 | (Photo-PTI)

Amaravati, Feb 21: ఏపీలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 4 గంటల నుంచి తుది విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాసేపట్లో తుది విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తారు. లెక్కింపు కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. మొదటివిడతలో 81.67 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండో విడతలో 81.67 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే మూడో విడతలో 80.71 శాతం పోలింగ్‌ నమోదైంది.

మధ్యాహ్నం ఓటింగ్‌ ముగిసే సమయానికి (AP Panchayat Elections 2021) శ్రీకాకుళం 78.81, విజయనగరం 85.60, విశాఖ 84.07, తూ.గో. 74.99, ప.గో. 79.03, కృష్ణా 79.29, గుంటూరు 76.74, ప్రకాశం 78.77, నెల్లూరు 73.20, చిత్తూరు 75.68, కర్నూలు 76.52, అనంతపురం 82.26, వైఎస్‌ఆర్‌ జిల్లాలో 80.68 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 2:30 వరకు 78.90 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. కౌంటంగ్ సమయంలో వెబ్ క్యాస్టింగ్, జనరేటర్లు ఏర్పాటు చేశారు.

గుంటూరు జిల్లాలో వట్టిచెరుకూరు మండలంలోని ముట్లూరులో ఐదవ వార్డు ఏజెంట్ అన్నవరపు బాబురావుపై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో ఏజెంట్ బాబురావుకు తీవ్రగాయాలు కాగా ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ బాబు రావు కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.

తూ.గో.జిల్లా ఐ పోలవరం మండలం, పశువులంక గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్ (AP Local Body Elections) సందర్భంగా వైసీపీ, టీడపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

చివరి దశకు చేరుకున్న పోలవరం పనులు, స్పిల్‌వే గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి, 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై అమర్చిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ, 2022 కల్లా ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని తెలిపిన పోలవరం డ్యామ్‌ డిజైన్ రివ్యూ క‌మిటీ చైర్మ‌న్ ఏబీ పాండ్యా

గుంటూరు: జిల్లాలో తొలి మూడు విడతల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినప్పటికీ నాలుగో విడత జరిగే గుంటూరు డివిజన్‌లో అల్లర్లు చెలరేగాయి సత్తెనపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రెండు వర్గాలు దాడులు, ప్రతిదాడులకు పాల్పడ్డాయి. సత్తెనపల్లి మండలం, దూళిపాలలో ఇద్దరు ఏజెంట్లు పోలింగ్ బూత్‌లోనే కొట్టుకున్నారు. వారు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు.

పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్‌ నేపథ్యంలో డీజీపీ గౌతం సవాంగ్‌ విజయనగరం జిల్లాలో పర్యటించారు. కొత్తవలస ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పోలీసుల తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

విశాఖ జిల్లా, భీమిలీ మండలం, తాటిచూరు గ్రామంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల ఉన్నతాధికారులు కూడా గ్రామానికి వచ్చారు. స్థానిక ఎస్ఐ గ్రామస్తుడిని కొట్టారు. ఈ క్రమంలో గ్రామస్తుడికి కాలు ఫ్యాక్చర్ అయింది. దీంతో గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.