Minister Roja vs Nara Lokesh: లోకేష్ జబర్దస్త్ ఆంటీ వ్యాఖ్యలపై రోజా కౌంటర్, అంకుల్ జోకులకు అంకులే నవ్వుకుంటున్నాడని ఎద్దేవా

ఇటీవల నగరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర ప్రవేశించినప్పటి నుంచి నారా లోకేశ్, మంత్రి రోజా మధ్య మాటల యుద్ధం (Roja vs Nara Lokesh) కొనసాగుతూనే ఉంది.మంత్రి రోజాను లోకేశ్ డైమండ్ పాప, జబర్దస్త్ ఆంటీ అంటూ ఎద్దేవా చేయగా, రోజా (Minister RK Roja) కూడా అందుకు ధీటుగానే అంకుల్ అంటూ కౌంటర్ ఇచ్చారు

Roja vs Nara Lokesh (Photo-Twitter)

ఇటీవల నగరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర ప్రవేశించినప్పటి నుంచి నారా లోకేశ్, మంత్రి రోజా మధ్య మాటల యుద్ధం (Roja vs Nara Lokesh) కొనసాగుతూనే ఉంది.మంత్రి రోజాను లోకేశ్ డైమండ్ పాప, జబర్దస్త్ ఆంటీ అంటూ ఎద్దేవా చేయగా, రోజా (Minister RK Roja) కూడా అందుకు ధీటుగానే అంకుల్ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, రోజా మరోసారి నారా లోకేష్ వ్యాఖ్యలపై స్పందించారు.

పోలవరం పనుల్లో మరో మైలు రాయి, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను పూర్తి చేసిన జగన్ సర్కారు, 1,655 మీటర్ల పొడవు, 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌

"అవును నేను జబర్దస్త్ ఆంటీనే. దానికి అంతగా నవ్వుతూ జబర్దస్త్ ఆంటీ అని పిలవాలా? అంత వ్యంగ్యం ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది? నాకు ఇద్దరు పిల్లలున్నారు... నా వయసుకు నేను ఆంటీనే. అందులో ఆశ్చర్యం ఏముంది?" అని రోజా ప్రశ్నించారు. లోకేశ్ (Nara Lokesh) వేసే జోకులకు జనాలు నవ్వడంలేదని, దాంతో తన జోకులకు తానే నవ్వుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించిన సీఎం జగన్, 3,591.65 ఎకరాల్లో రూ.11,606 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు

జగన్ మోహన్ రెడ్డిని చూసి తాను కూడా సీఎం అవ్వాలని లోకేశ్ పాదయాత్ర చేస్తున్నాడని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉందని రోజా విమర్శించారు. లోకేశ్ ఒక పొలిటికల్ జీరో అని ప్రజలే అంటున్నారని, పాదయాత్ర మొదటి నుంచి ఇప్పటివరకు గమనిస్తే ఆ విషయం లోకేశ్ కే అర్థమవుతుందని అన్నారు. లోకేశ్ మీటింగులకు ఎక్కడా జనం రావడంలేదని, అటు తమిళనాడు నుంచి ఇటు కర్ణాటక నుంచి ప్రజలను తీసుకువస్తున్నా వారు కూడా నిలిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు.