Balakrishna Slams CM Jagan: జగన్‌కు పబ్‌జీ ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు, యువగళం పాదయాత్రలో మండిపడిన బాలయ్య, మళ్లీ సైకో పాలన వస్తే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని వెల్లడి

అంతకుముందు బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

Balakrishna (Photo-Twitter/TDP)

Singanamala, April 7: అనంతపురం జిల్లా శింగనమలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రలో బాలయ్య పాల్గొన్నారు.మార్తాడులోని క్యాంప్‌ సైట్‌ నుంచి లోకేశ్‌తో కలిసి ఆయన ముందుకు సాగారు. అంతకుముందు బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. అభివృద్ధి శూన్యం, దోపిడీ ఘనం అన్నట్లుగా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. లోకేశ్‌ పాదయాత్ర యువతరానికి స్ఫూర్తి అన్నారు. గతంలో యువత కోసం టీడీపీ ఏం చేసిందో ఆయన చెబుతున్నారని.. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేశ్‌కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.

జగనన్నే మా భవిష్యత్తు ప్రారంభం, ఈ నెల 20వ తేదీ వరకూ 175 నియోజకవర్గాల్లో కొనసాగనున్న కార్యక్రమం, ఐదు కోట్ల మంది ప్రజలతో మమేకం

జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యం. పరిశ్రమలు రాలేదు.. ఉపాధి కల్పన జరగలేదు. రాష్ట్రమంతటా ల్యాండ్, శాండ్‌ మాఫియా రెచ్చిపోతోంది. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ కేసులతో వేధిస్తున్నారు. రాష్ట్రంలో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదు. చెత్తపైనా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో ఉంది. రాష్ట్రంలో మళ్లీ సైకో పాలన వస్తే ఏపీ ప్రజలు మరోచోటికి వలసపోవాల్సి వస్తుంది. అప్పుడు రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది. వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. చాలా మంది మా పార్టీతో టచ్‌లో ఉన్నారు.

టీడీపీలో చేరి ప్రజాసేవ చేద్దామని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రికి పబ్‌జీ ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు. వైసీపీ ఓటమి అంచుల్లో ఉందని జగన్‌కూ తెలుసు. వైసీపీ అరాచకాలను ఎదిరించేందుకు ప్రజలంతా ముందుకు రావాలి. టీడీపీ పాలన మళ్లీ వస్తుంది.. అందరి సమస్యలు పరిష్కరిస్తుంది’’ అని హీరో బాలయ్య అన్నారు.



సంబంధిత వార్తలు

Aramgarh Flyover: హైదరాబాద్‌ నగరంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, ఆరాంఘర్‌- జూపార్క్‌ ఫ్లై ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Anchor Forget CM Revanth Reddy Name: సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయిన హీరో, కిరణ్‌కుమార్‌ అంటూ స్టేజి మీదకు ఆహ్వానించడంతో ఒక్కసారిగా గందరగోళం

CM Revanth Reddy: ఇది ఆర్ధిక సాయం కాదు…ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహం, సివిల్స్‌లో మనవాళ్లే రాణించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు