Priest Murdered in AP: ఏపీలో దారుణం, శివాలయం లోపల పూజారి దారుణ హత్య, తల పగుల గొట్టి ఆయన్ను దారుణంగా హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు

జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్లలో గల శివాలయంలోని పూజారిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు.

Murder (Photo Credits: Pixabay)

Nidadavolu, Mar 22: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం (Priest Murdered in AP) చోటుచేసుకుంది. జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్లలో గల శివాలయంలోని పూజారిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. ఈ గ్రామంలోని శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న కొత్తలంక శివ నాగేశ్వరరావు (55) ను గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం లోపలే హత్య (Priest brutally murdered by unidentified persons) చేయడం కలకలం రేపుతోంది. తల పగులగొట్టి ఆయన్ను దారుణంగా చంపినట్లు పోలీసులు తెలిపారు.

సోమవారం అర్ధరాత్రి అయినప్పటికీ భర్త ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య వెంటనే కుటుంబసభ్యులకు ఆమె సమాచారం అందించింది. అయితే.. ఆయన ఆచూకీ గురించి ఎక్కడ అడిగినా ఫలితం లేకపోవడంతో.. కుటుంబ సభ్యులు రాత్రి ఆలయం వద్దకు వచ్చి వెతికారు. ఆలయం బయట శివనాగేశ్వరరావు వాహనం కనిపించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. అయితే.. పొలం వద్ద వెతికినా పూజారి వాహనం కనిపించకపోవడంతో వేరే పని మీద వెళ్లి ఉంటారని అందరూ భావించారు. ఉదయం అవుతున్నా ఆయన రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆలయం లోపలికి వెళ్లి పరిశీలించారు. ఈ క్రమంలో పూజారి ఆలయ ఆవరణలోనే (temple premises) రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

తమ నేత హత్యకు ప్రతీకారం.. బెంగాల్‌లో ఐదు ఇళ్లకు బయట నుంచి తాళాలు వేసి నిప్పంటించిన దుండగులు, ఏడుగురు మంటల్లో సజీవదహనం

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూజారికి వేరే వారితో ఏమైనా గొడవలు ఉన్నాయా..? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.