Covid in AP: కర్ప్యూ దెబ్బకు తగ్గిన కరోనా కేసులు, పెరిగిన డిశ్చార్జ్ రేటు, తాజాగా 20,392 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఇంటికి, గత 24 గంటల్లో 13,756 మందికి పాజిటివ్, ఏపీలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు

Coronavirus Outbreak | Representational Image | (Photo Credits: PTI)

Amaravati, May 29: ఏపీలో రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గడచిన 24 గంటల్లో 79,564 కరోనా పరీక్షలు నిర్వహించగా 13,756 మందికి పాజిటివ్ గా (Covid in AP) నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2,301 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 2,155 కేసులు (Coronavirus in Chittoor) గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 397 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కాగా మరణాల సంఖ్య మాత్రం ఇప్పటికీ 100కి పైనే నమోదవుతుండడం ఆందోళన కలిగించే అంశం.

తాజాగా ఏపీలో 104 మంది కరోనాతో (Covid Deaths) మృత్యువాతపడ్డారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 20 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో 13 మంది, విశాఖ జిల్లాలో 10 మంది బలయ్యారు. ఈ నేపథ్యంలో మొత్తం మరణాల సంఖ్య10,738కి చేరింది. అదే సమయంలో 20,392 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,71,742 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 14,87,382 మంది కోలుకున్నారు. ఇంకా 1,73,622 మందికి చికిత్స జరుగుతోంది.

గత 24 గంటల్లో అనంతపురంలో 1224 కేసులు, చిత్తూరులో 2155, ఈస్ట్ గోదావరిలో 2301, గుంటూరులో 780, కడపలో 632, కృష్ణాలో 782, కర్నూలులో 742, నెల్లూరులో 865, ప్రకాశంలో 811, శ్రీకాకుళంలొ 666, విశాఖపట్నంలో 1004, విజయనగరంలో 397, వెస్ట్ గోదావరిలో 1397 కేసులు నమోదయ్యాయి.

చిత్తూరు జిల్లాలో జూన్ 15 వరకు కర్ఫ్యూ పొడిగింపు, కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇకపై కొవిడ్‌ నెగిటివ్ ఉంటేనే జిల్లాలోకి ఎంట్రీ

ఇదిలా ఉంటే ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ దీనిపై స్పందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 808 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు సరిపడా ఔషధాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. వ్యాక్సినేషన్ పైనా ఆయన వివరణ ఇచ్చారు. రోజుకు లక్ష మందికి వ్యాక్సిన్లు అందించే సామర్థ్యం ఉందన్నారు. కేంద్రం పంపిన డోసుల మేరకు ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్ చేస్తామని చెప్పారు.

విమాన ప్రయాణికులకు షాక్, ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెంపు, 40 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2,300 నుంచి రూ.2,600, పెరిగిన ధరల లిస్ట్ ఇదే..

ఏపీలో విధించిన కర్ఫ్యూ సత్ఫలితాలను ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో మే 5 నుంచి కర్ఫ్యూ, 144 సెక్షన్ అమల్లో ఉందని వెల్లడించారు. మే 3న రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 25 శాతంగా ఉందని, అదిప్పుడు 17.29 శాతానికి తగ్గిందని సింఘాల్ వివరించారు. కొవిడ్ చికిత్సలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న 66 ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.