AP Coronavirus: ఏపీలో మంత్రి కుమారుడికి కరోనా, తాజాగా 1608 కోవిడ్-19 కేసులు నమోదు, సచివాలయానికి మరోసారి కరోనా సెగ, కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య
గత 24 గంటల్లో 21,020 సాంపిల్స్‌ను పరిక్షించగా అందులో 1576 కేసులు (new COVID-19 cases) ఏపీలో నమోదవ్వగా, మిగతా 32 కరోనా కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారివి ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 25,422కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కొత్తగా 981 మంది డిశ్చార్జి కాగా .. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 13,194గా ఉంది.
Amaravati, June 10: ఏపీలో శుక్రవారం కొత్తగా 1608 కరోనా కేసులు (AP Coronavirus) నమోదయ్యాయి. గత 24 గంటల్లో 21,020 సాంపిల్స్‌ను పరిక్షించగా అందులో 1576 కేసులు (new COVID-19 cases) ఏపీలో నమోదవ్వగా, మిగతా 32 కరోనా కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారివి ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 25,422కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కొత్తగా 981 మంది డిశ్చార్జి కాగా .. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 13,194గా ఉంది. ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు, 15 నిమిషాల్లోనే కరోనా ఫలితాన్ని ఇచ్చే రాపిడ్ కిట్లు అందుబాటులోకి, అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు పరీక్షలు
తాజాగా కరోనాతో మరో 15 మంది మృతి చెందడంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 292కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,936 యాక్టివ్ కేసులుగా ఉన్నాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా (Andhra Pradesh) రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్న కరోనా వైద్య పరీక్షలు 11లక్షల మార్కును దాటాయి. ఇప్పటివరకు 11,15,635 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి మిలియన్‌కు 20,892 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.
Here's AP Corona Report
ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాసు కుమారుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మంత్రి తరపున కుమారుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. దీంతో ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. కుమారుడికి పాజిటివ్ రావడంతో నిన్నటినుంచి మంత్రి కృష్ణదాసు హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. బుధవారం ఆముదాలవలసలో జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు. దీంతో స్పీకర్ తమ్మినేని కూడా హోం క్వారంటైన్‌కు వెళ్లారు. 15 రోజుల పాటు క్యాంపు కార్యాలయాలకు రావద్దంటూ ఇప్పటికే మంత్రి, స్పీకర్ కార్యకర్తలకు సూచించారు. మరో కొత్త వైరస్ బాంబును పేల్చిన చైనా, అంతుచిక్కని వైరస్‌తో న్యుమోనియా సోకి కజకిస్థాన్‌లో వందలాది మంది మృత్యువాత, జాగ్రత్తగా ఉండాలని చైనీయులకు డ్రాగన్ కంట్రీ హెచ్చరిక
తాజాగా ఏపీ సచివాలయంలో మరోసారి కరోనా కలకలం రేపింది. తాజాగా మరో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అసెంబ్లీ, సచివాలయంలో కరోనా పాజిటివ్ కేసులు 38కి చేరుకున్నాయి. ఇదిలా ఉంటే కర్నూలు నగరంలో విషాదం చోటు చేసుకుంది. కేవీఆర్ గార్డెన్స్‌లో నివసించే ఓ వ్యక్తి కరోనా సోకిందనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరీక్ష నివేదిక రాకముందే వైరస్ సోకిందని భావించి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. నెగిటివ్ నిర్ధారణ అయింది. అయితే రిపోర్టు శుక్రవారం వచ్చింది. కానీ గతరాత్రి హుస్సేన్ ఉరి వేసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు రోధిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బెజవాడలో కరోనా భయంతో ఇంటి నుంచి శ్రీనివాసరావు అనే వ్యక్తి వారం క్రితం పారిపోయాడు. వారం క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ టెస్టులు చేయించుకున్న శ్రీనివాసరావు.. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. కాగా.. శ్రీనివాసరావుకు టెస్టుల్లో కరోనా నెగిటివ్ అని తేలింది. పాజిటివ్ వస్తుందేమోనన్న భయంతో పారిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.