Coronavirus in India (Photo Credits: PTI)

Amaravati, July 10: ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇకపై అత్యవసర వైద్యం కోసం వచ్చిన వారు కోవిడ్‌–19 టెస్ట్‌ (COVID-19 Test) ఫలితం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పనిలేదు. ఇకపై కేవలం 15 నిమిషాల్లో ఫలితం తెలుసుకుని చికిత్స అందించే విధంగారాష్ట్ర ప్రభుత్వం (AP Govt) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కోవిడ్‌–19 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్‌లను (COVID-19 Rapid Test Kits) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కడు 119 మందికి కరోనాని అంటించాడు, దేశంలో 8 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, కరోనా నుంచి కోలుకున్న 96 ఏళ్ల బామ్మ, 21,604కు చేరిన మరణాల సంఖ్య

ఈ కిట్‌లోని స్వాబ్‌తో మొదట ముక్కులో నుంచి జిగురును పరీక్ష కోసం తీస్తారు. దానిని కిట్‌లోని లిక్విడ్‌లో మూడుసార్లు తిప్పి, ఆ స్వాబ్‌కు అతుక్కున్న మూడు చుక్కల ద్రవాన్ని కిట్‌పై వేస్తారు. 15 నిమిషాల అనంతరం ఫలితం వెల్లడవుతుంది. కిట్‌పై రంగు మారితే కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు, ప్రసవాలు, ప్రమాదాల చికిత్స కోసం వచ్చిన వారికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.

ఈ మేరకు మొదటి విడతగా జిల్లాకు 1,900 కిట్లు చొప్పున పంపారు. గురువారం నుంచే ఈ కిట్ల ద్వారా అత్యవసర రోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కిట్‌ ద్వారా పాజిటివ్‌ వస్తే అతనికి కరోనా ఉన్నట్లు నిర్ధారిస్తామని కోవిడ్‌ పరీక్షల నోడల్‌ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ రోగికి జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉండి, అతనికి నెగిటివ్‌ ఫలితం వచ్చినా మళ్లీ ఆ వ్యక్తికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేస్తామన్నారు.