Corona in Andhra Pradesh: కరోనా థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి, స్పందన సమీక్షలో ఏపీ సీఎం వైయస్ జగన్, రాష్ట్రంలో తాజాగా 3,042 మందికి కరోనా, 3,748 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్
గడిచిన 24 గంటల్లో ఏపీలో 88,378 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,042 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 28 మంది మృత్యువాత పడ్డారు.
Hyderabad, July 6: ఆంధ్రప్రదేశ్ లో గత వారం రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య తగ్గడంతోపాటు, రికవరీల రేటు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 88,378 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,042 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 28 మంది మృత్యువాత పడ్డారు.
దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,898 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 3,748 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 61 వేల 937 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 33,230 యాక్టివ్ కేసులు (Active Cases) ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,90,8065 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,25,24,187 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 104 కాల్ సెంటర్.. వన్ స్టాప్ సొల్యూషన్ కావాలని, థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ సెకండ్ డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిరంతరాయంగా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. జ్వరం లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేసి, వైద్య సేవలందించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. నోటిఫై చేసిన ఆస్పత్రులను పర్యవేక్షించాలని, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.