AP Covid Second Wave: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ పంజా, ఒక్క రోజే 12 మంది మృతి, తాజాగా 3,309 మందికి కరోనా, కస్తూర్బా బాలికల విద్యాలయంలో 12 మందికి కోవిడ్ పాజిటివ్

చిత్తూరు జిల్లాలో భారీ స్థాయిలో 740 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 527, విశాఖ జిల్లాలో 391, కర్నూలు జిల్లాలో 296 కేసులు వెల్లడయ్యాయి. ఏపీలోని 13 జిల్లాల్లో విజయనగరం (97), పశ్చిమ గోదావరి (26) జిల్లాల్లో మాత్రం రెండంకెల్లో కొత్త కేసులు నమోదయ్యాయి.

Coronavirus Outbreak. | (Photo-PTI)

Amaravati, April 10: ఏపీలో గడచిన 24 గంటల్లో ఏపీలో 31,929 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,309 మందికి కరోనా నిర్ధారణ (AP Covid Report) అయింది. చిత్తూరు జిల్లాలో భారీ స్థాయిలో 740 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 527, విశాఖ జిల్లాలో 391, కర్నూలు జిల్లాలో 296 కేసులు వెల్లడయ్యాయి. ఏపీలోని 13 జిల్లాల్లో విజయనగరం (97), పశ్చిమ గోదావరి (26) జిల్లాల్లో మాత్రం రెండంకెల్లో కొత్త కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 1,053 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది (12 Deaths in Past 24 Hours) మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ముగ్గురు బలయ్యారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,291కి పెరిగింది. అటు, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,21,906కి చేరింది. 8,95,949 మంది కోలుకున్నారు. ఇంకా 18,666 మంది చికిత్స పొందుతున్నారు.

కర్నూలు జిల్లాలో ఓ పాఠశాలలో కొవిడ్ కలకలం రేగింది. చాగలమర్రిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలోని 12 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ గురుకుల విద్యాలయంలో 246 మంది విద్యార్థినులు ఉండగా, అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న 80 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

చంద్రబాబుకు కరోనా టెన్సన్, టీడీపీ అధినేతను కలిసిన అనిత, సంధ్యారాణి‌లకు కరోనా పాజిటివ్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, మాజీ మంత్రి జవహర్‌లకు కోవిడ్ నిర్థారణ, టీడీపీ ప్రచారంలో కలకలం రేపుతున్న కరోనా

కాగా, కొవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థినులను వైద్య అధికారులు ఐసోలేషన్ కు తరలించారు. పాఠశాల సముదాయంలోనే ఓ గదిలో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో విద్యాసంస్థల్లోనూ కరోనా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ (AP Covid Second Wave) నడుస్తోందన్న అంచనాల నేపథ్యంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.