Coronavirus in AP: ఏపీలో ఐదు లక్షలు దాటిన కరోనా కేసులు, తాజాగా 8,368 కోవిడ్ కేసులు నమోదు, 24 గంటల్లో 70 మంది మృతితో 4,487కు చేరుకున్న మృతుల సంఖ్య
దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలు (state tally crosses 5-lakh mark) దాటింది. వరుసగా 11 రోజుల పాటు 10వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,06,493కు చేరింది.
Amaravati, Sep 7: ఏపీలో కొత్తగా 8,368 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ (Coronavirus in AP) అయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలు (state tally crosses 5-lakh mark) దాటింది. వరుసగా 11 రోజుల పాటు 10వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,06,493కు చేరింది.
వైరస్ ప్రభావంతో తాజాగా 70 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 4,487కు (Coronavirus Deaths) చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,04,074 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 97,932 యాక్టివ్ కేసులున్నాయి. ఆదివారం ఒకే రోజు 58,157 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 41,66,077 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.
ప్రకాశం 10, గుంటూరు 9, చిత్తూరు జిల్లాలో 8 మంది మృతి చెందారు. కడప 7, ప.గో. 7, కృష్ణా 5, నెల్లూరు 5, తూర్పుగోదావరిలో ముగ్గురు మృతి చెందారు. అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖలో నలుగురు చొప్పున మృతి చెందారు. కొవిడ్ మహమ్మారి రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తోంది. పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. సెప్టెంబరు, అక్టోబరులోనూ కరోనా తీవ్రత మరింత అధికంగా ఉంటుందని ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది.
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి చెలరేగిపోతోంది. ఈ ఒక్క జిల్లాలోనే 68 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారంతో కలిపి తూర్పు గోదావరిలో ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా 68,260 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.