Covid in AP: కరోనాపై ఊరట..ఏపీలో లక్షా అరవై వేలకు పైగా డిశ్చార్జ్ కేసులు, తాజాగా 9,597 కేసులు నమోదు, రాష్ట్రంలో 2,54,146కు చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య
దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,146 కు చేరింది. తాజా పరీక్షల్లో 32,837 ట్రూనాట్ పద్ధతిలో, 24,311 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. గత 24 గంటల్లో 6,676 మంది కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,61,425 కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 90,425 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బాధితుల్లో కొత్తగా 93 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2296 కు చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 26,49,767 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
Amaravati, August 12: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించగా 9,597 పాజిటివ్ కేసులు (new Covid cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య (AP Coronavirus) 2,54,146 కు చేరింది. తాజా పరీక్షల్లో 32,837 ట్రూనాట్ పద్ధతిలో, 24,311 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. గత 24 గంటల్లో 6,676 మంది కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,61,425 కు చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 90,425 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బాధితుల్లో కొత్తగా 93 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య (Covid Deaths) 2296 కు చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 26,49,767 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
Here's AP Covid Report
ఇదిలా ఉంటే ఏపీలో కోవిడ్ బారిన పడి కోలుకుంటున్న వారి శాతం గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత నెల రోజుల్లో 1.39 లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రాష్ట్రంలో నమోదైన 2.44 లక్షల పాజిటివ్ కేసుల్లో ఇప్పటి వరకు లక్షా 60 వేలకు పైగా రికవరీ అయినట్లు వైద్యారోగ్యశాఖ బుధవారం ట్విటర్‌లో తెలిపింది. ప్రస్తుతం 90,425 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. మరోసారి పూర్తి స్థాయి లాక్‌డౌన్, కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు ఒంగోలులో మరోసారి కంటైన్‌మెంట్ ఆంక్షలు విధించిన కలెక్టర్ పోల భాస్కర్, రెండు వారాల పాటు అమల్లోకి..
తాజా గణాంకాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌లో రికవరీ రేటు 63.28 శాతంగా నమోదయింది. మొన్నటివరకూ ఇది 50 నుంచి 55 శాతం మధ్య ఉండేది. మంగళవారం ఒక్కరోజే 9,113 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ దూకుడు కొనసాగిస్తోంది. మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో 25,92,619 టెస్టులు చేశారు. మిలియన్ జనాభాకు 48,551 టెస్టులు చేస్తున్నారు. దేశంలో ఇదే అత్యధికమని ఐసీఎంఆర్ గణాంకాల్లో తేలింది.