Andhra Pradesh Shocker: ఎవరతను? గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య, కత్తితో మెడ, పొట్ట భాగంలో పొడిచి పరారయిన యువకుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పాత గుంటూరు పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌

బీటెక్‌ విద్యార్థిని దుండగుడు కత్తితో (BTech student assassination in guntur) పొడిచి చంపాడు. పొట్ట, గొంతులో 6 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థిని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు

Image used for representational purpose only | (Photo Credits: PTI)

Guntur, August 15: గుంటూరు జిల్లా కాకాని రోడ్డులో దారుణ హత్య చోటుచేసుకుంది. బీటెక్‌ విద్యార్థిని దుండగుడు కత్తితో (BTech student Murder in guntur) పొడిచి చంపాడు. పొట్ట, గొంతులో 6 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థిని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై అర్బన్‌ ఎస్పీ హఫీజ్‌ దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన యువతి సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్ ఓపెన్ చేస్తే హత్య కేసులో కీలక సమాచారం లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న రమ్య (BTech student) కాకాణి రోడ్డులో వెళుతోంది. అటుగా వచ్చి ఓ యువకుడు తన బైక్‌పై ఎక్కాలని విద్యార్థినిని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో రమ్య మెడ, పొట్ట భాగంలో పొడిచి (Murder) అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తమోడుతున్న యువతిని స్థానికులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆ బైక్ పై వచ్చిన యువకుడు ఎవరని పోలీసులు ఆరాతీసే పనిలో పడ్డారు.

పక్కింటి ఆంటీతో అక్రమ సంబంధం, పెళ్లి కాగానే ఆమెను వదిలేశాడు, తట్టకోలేక భర్తతో కలిసి యువకుడి భార్యను చంపేసిన ఆంటీ, పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి..

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థిని మృతదేహాన్ని అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా పాత గుంటూరు పోలీసులను ఆయన ఆదేశించారు. ఈ ఘటన వెనకున్న కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. జీజీహెచ్‌లో విద్యార్థి మృతదేహాన్ని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. అందరు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఉండగా ఈ దారుణ ఘటన జరిగిందని, నిందితుడిని తక్షణమే పట్టుకోవాలని పోలీసులకు సూచించానన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులకు అండగా ఉంటామని మనహార్ నాయుడు అన్నారు.