Andhra Pradesh Shocker: ప్రేమించలేదని పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు, అతను నిప్పటించుకున్నాడు, కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఉన్మాది దారుణ ఘటన

ఆ యువతి తన ప్రేమను నిరాకరించడంతో పాటు పోలీసులకు పిర్యాదు చేసిందని కసితో రగిలిపోయి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన సోమవారం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

Crime | Representational Image (Photo Credits: Pixabay)

Vijayawada, October 13: ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడమే కాకుండా ప్రేమించలేదన్న కోపంతొ ఉన్మాది (Andhra Pradesh Shocker) ఓ యువతిపై పెట్రోల్ పోసి సజీవదహనం (Estranged Lover Burns Woman) చేశాడు. ఆ యువతి తన ప్రేమను నిరాకరించడంతో పాటు పోలీసులకు పిర్యాదు చేసిందని కసితో రగిలిపోయి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన సోమవారం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన యువతి విజయవాడలోని ఓ కొవిడ్ కేర్ సెంటర్‌లో నర్సుగా పని చేస్తోంది.స్నేహితురాళ్లతో కలిసి ఆస్పత్రికి సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటోంది. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి ఆమెను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ వ్యవహారం శృతిమించడంతో నాలుగు రోజుల కిందట గవర్నర్‌పేట పోలీసుస్టేషన్‌లోఆ యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు నాగభూషణాన్ని పిలిచి హెచ్చరించడంతో ఆమెకు దూరంగా ఉంటానని, ఏమీ చేయనని అతను స్టేట్‌మెంట్‌ రాసి ఇచ్చాడు. దీంతో ఫిర్యాదును యువతి వెనక్కి తీసుకుంది.

కాకినాడలో తీరం దాటిన వాయుగుండం, విజయవాడలో విరిగిన కొండ చరియలు, భారీ వర్షాలకు ఏపీలో ఇద్దరు మృతి, విశాఖలో ఒడ్డుకు కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్‌ మర్చంట్‌ వెసల్‌ నౌక

అయితే, రోజులానే సోమవారం విధులకు హాజరైన ఆ యువతి రాత్రి 8 గంటలకు విధులను ముగించుకుని ఒంటరిగా ఇంటికి వెళుతుండగా.. మాటు వేసిన నాగభూషణం ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నాగభూషణం ముందుగానే తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ను యువతిపై పోసి నిప్పంటించాడు. తనూ ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో బాధిత యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలైన నాగభూషణాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగభూషణం కూడా మృతి చెందాడని పోలీసులు తెలిపారు.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif