Heavy Rains Lash AP (Photo-ANI)

Amaravati, Oct 13: సోమవారం రాత్రి నుంచి వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains Lash AP) కురిశాయి. విశాఖపట్నం, విజయవాడలో వర్ష సంబంధిత సంఘటనల్లో ఇద్దరు మరణించగా, విశాఖపట్నంలో ఒక కార్గో షిప్ కొట్టుకుపోయింది. ఐఎండి (IMD) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం మంగళవారం ఉదయం 6:30 గంటల నుండి ఉదయం 7:30 గంటల మధ్య కాకినాడ సమీపంలో తీరం (depression crosses coast near Kakinada) దాటింది. ఇది తీరం దాటిన తరువాత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కాగా మంగళవారం ఉదయం నర్సిపట్నం నుంచి తిరుపతి వెళ్లే కారులోజి దేవి అనే మహిళ అర్చన (28), దీపక్ (34), డ్రైవర్ వెంకటేష్ (30) అనే ముగ్గురితో ప్రయాణిస్తున్నది. అయితే, రహదారిపై పొంగిపొర్లుతున్న గన్నవరం మెట్టా సమీపంలో ఉన్న ప్రవాహంలో ఆ కారు కొట్టుకుపోయింది. అర్చన, దీపక్ మరియు వెంకటేష్ కారు నుండి తప్పించుకోగలిగారు మరియు తరువాత పోలీసులు వారిని రక్షించారు, వృద్ధ మహిళను విడిపించలేకపోయారు.

ANI Updates: 

ఇక భారీ వర్షాల కారణంగా విజయవాడలో కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్లో నివాసాలపై కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు ధ్వంసమైంది. దాంతో ఆ ఇంట్లో నివాసముంటున్న వ్యక్తి మట్టిలో కూరుకుపోయాడు. మట్టి పెళ్లలను తొలగించి అంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినాఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలపాలైన బాధితుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

ANI Update:

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ నగరం అతలాకుతలం అవుతోంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ తెన్నేటి పార్క్‌ తీరానికి ఓ భారీ నౌక కొట్టుకుని వచ్చింది. బంగ్లాదేశ్‌కు చెందిన మర్చంట్‌ వెసల్‌ నౌక భారీ ఈదురు గాలులకు కొట్టుకువచ్చింది.

తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వర్షాలు

గాలితీవ్రత ఎక్కవగా వుండటంతో ప్రతికూల పరిస్ధితుల్లో ఒడ్డుకు చేరుకున్న 80 మీటర్ల పొడవాటి నౌక పార్క్‌ సమీపంలోని రాళ్లలో చిక్కుకుంది. అర్ధరాత్రి సమయంలో ఇసుక తిన్నుల మధ్య చిక్కుకోగా.. నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. యాంకర్లు రెండూ కోల్పోవడంతో ఏర్పడిన సమస్య తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న నేవీ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నౌకను చూసేందుకు స్ధానికులు పెద్ద ఎత్తున తీరానికి చేరుకుంటున్నారు.

ఏపీ సర్కారు కీలక నిర్ణయం, కోవిడ్ పోరులో మరణించిన జర్నలిస్టులకు రూ.5 లక్షల పరిహారం, హామీ ఇచ్చిన ఏపీ సీఎం వైయస జగన్ మోహన్ రెడ్డి

భారీ వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి వరద పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం ఉదయం 6:30 నుంచి 7: 30 మధ్య కాకినాడకు అతి సమీపంలో వాయుగుండం తీరం దాటిందని విపత్తుల శాఖ కమిషనర్‌ కె. కన్నబాబు తెలిపారు. ఈ కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.