Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వర్షాలు, వాయుగుండం నేడు తీరం దాటే అవకాశం, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు
A view of a flooded street at Himayat Nagar (photo-PTI)

Amaravati, Oct 13: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు (Heavy Rains in Telugu States) కురుస్తున్నాయి. తెలంగాణతో పాటు రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) పలు చోట్ల అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో (West Central Bay of Bengal) ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి నేడు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. విశాఖ-నరసాపురం మధ్య కాకినాడ సమీపంలో తీరందాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 55-75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌ సహా వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కృష్ణా మిగులు జలాలపై హక్కు మాదే, సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీకి స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం, భారీ ఇన్ ఫ్లో వచ్చే అవకాశం ఉన్నందున నీటిని దిగువకు వదిలేయాలని కృష్ణ బేసిన్‌లోని పలు జలాశయాలకు సిడబ్ల్యుసి సూచన

తీవ్ర వాయుగుండం నేడు తీరం దాటనుండగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్‌-విశాఖపట్నం మధ్యలో కాకినాడకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.

మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్ల నుంచి ఎస్పీల వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పోలీస్‌శాఖకు డీజీపీ అప్రమత్తం చేశారు. కాగా, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వనపర్తి పట్టణ శివారులోని జెర్రిపోతుల మైసమ్మ దగ్గర వాగులో ఇద్దరు గల్లంతయ్యారు. కాసేపటికే ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వాగు దాటుతుండగా.. జారి కిందపడ్డారు.

రూపుమార్చుకున్న అల్పపీడనం, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, ఏపీలో నర్సాపూర్‌, విశాఖపట్నం మధ్య రాత్రికి తీరం దాటే అవకాశం, హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ శాఖ

స్థానికులు రక్షించడంతో పాటు ప్రాణాలతో బయటపడ్డాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు వద్ద కేఎల్‌ఐ ప్రధాన కాలువలో జార్ఖండ్‌కు చెందిన కార్మికుడు పడి గల్లంతయ్యాడు. ఫైర్‌ రెస్క్యూ బృందం గాలింపు చర్యలు చేపట్టాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వాయుగుండం ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. నర్సాపురం, తాడేపల్లిగూడెం,ఏలూరు పలు ప్రాంతాలలో కుండపోతగా వర్షాలుకురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల వర్షం పడుతోంది.కాకినాడలో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాయుగుండం ప్రభావంతో రాజమండ్రిలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.

రాగల నాలుగైదు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో..భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం... కర్నూలు, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ముందస్తుగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఐఎండీ సూచించింది.