Andhra Pradesh Shocker: కుటుంబంలో గొడవలు, అత్తతో పాటు భార్యను కత్తితో పొడిచి పరారయిన భర్త, హిందూపురంలో దారుణ ఘటన

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, అత్తపై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం హిందూపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. స్థానిక మోడల్‌ కాలనీకి చెందిన శ్రావణ్, గౌతమి దంపతులు. ఆరేళ్ల క్రితం వివాహమైన వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు.

Representative Image Murder ( Photo Credits : Pixabay

Hindupur, May 30: ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, అత్తపై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం హిందూపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. స్థానిక మోడల్‌ కాలనీకి చెందిన శ్రావణ్, గౌతమి దంపతులు. ఆరేళ్ల క్రితం వివాహమైన వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. కొంత కాలంగా భార్య ప్రవర్తనపై అనుమానాలు పెంచుకున్న శ్రావణ్‌ తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ విషయంగా పలుమార్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. కౌన్సెలింగ్‌తో దంపతుల మధ్య విభేదాలను పోలీసులు దూరం చేస్తూ వచ్చారు.అద్దె ఇంటి కోసం యువతి రూంలోకి రాగానే తలుపులు వేసిన కామాంధుడు, బ‌ట్ట‌లు విప్పాల‌ని బ‌ల‌వంతం చేస్తూ అత్యాచారయత్నం, హైదరాబాద్‌లో విషాద ఘటన

అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు దంపతులిద్దరూ విడాకుల కోసం న్యాయస్థానం మెట్టు ఎక్కారు. ఈ క్రమంలోనే తల్లి సుశీలమ్మ వద్దకు గౌతమి చేరుకుంది. ఆదివారం తన కొడుకును తనకిచ్చేయాలంటూ అత్తారింటికి వెళ్లి శ్రావణ్‌ గొడవపడ్డాడు. వాదన శ్రుతి మించడంతో తమ్ముడు నవీన్‌తో కలిసి తల్లి కూతురుపై శ్రావణ్‌ కత్తితో దాడి చేసి, పారిపోయాడు. ఘటనలో గౌతమి, ఆమె తల్లి సుశీలమ్మ గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరినీ బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై రెండో పట్టణ సీఐ సూర్యనారాయణ కేసు నమోదు చేశారు.