Andhra Pradesh Shocker: విశాఖలో దారుణం, కూతురిపై కన్న తండ్రి కొన్ని నెలలుగా అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

నిందితుడిని (Andhra Pradesh Shocker) ఆదివారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వృత్తిరీత్యా వ్యాపారి అయిన నిందితుడికి రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో రెండేళ్ల క్రితం అస్వస్థతకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Visakhapatnam, Jan 24: వైజాగ్ నగరంలో తన 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై 42 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని (Andhra Pradesh Shocker) ఆదివారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వృత్తిరీత్యా వ్యాపారి అయిన నిందితుడికి రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో రెండేళ్ల క్రితం అస్వస్థతకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. అతని భార్య తన కిడ్నీలో ఒకదాన్ని అతనికి దానం చేసింది. ఈ దంపతులకు కుమార్తె (15), కుమారుడు (13) ఉన్నారు.

ఐదు నెలల క్రితం, నిందితుడి భార్య అనారోగ్యానికి గురైంది, అప్పటి నుండి ఆమె తల్లి ఇంట్లో చికిత్స పొందుతోంది. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆ దంపతుల కూతురు తన తండ్రి ఆలనా పాలన చూసుకునేది. ఈ నేపథ్యంలో తన కుమార్తె ఎక్కువ సమయం ఫోన్‌లోనే గడిపిందనే కోపంతో నిందితుడు ఆమెపై అత్యాచారానికి (Man Rapes Minor Daughter) పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా అతడు తనపై అత్యాచారం చేస్తున్నా, బాలిక మౌనంగా ఉండిపోయింది. ఇటీవల తండ్రి వేధింపులు భరించలేక టీచర్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. ఉపాధ్యాయురాలు నిందితుడిని పాఠశాలకు పిలిచింది. నిందితుడు క్షమాపణలు చెప్పినప్పటికీ, ఉపాధ్యాయురాలు, బాలికతో కలిసి శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి బాలికను పరీక్షలకు తరలించారు.

శాడిస్ట్ భర్త కిరాకతకం, భార్య ప్రైవేట్ భాగాల్లో కాలుస్తూ, నలుగురు స్నేహితులతో కలిసి దారుణంగా అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన ఇండోర్ పోలీసులు

మరో ఘటనలో ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో 12 ఏళ్ల బాలుడిని వైజాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగినప్పటికీ, చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో శనివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బాలిక ఆడుకుంటున్న సమయంలో బాలుడు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.