Andhra Pradesh Shocker: భార్యపై అనుమానం పెంచుకున్నభర్త, తట్టుకోలేక కత్తితో మర్మాంగాల దగ్గర పొడిచి చంపేసిన భార్య, కడపలో లోహియానగర్‌లో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కడప పోలీసులు
అనుమానం వేధింపులు ఎక్కువ కావడంతొ తట్టుకోలేక చివరకు భర్తను హత్య (wife killed her husband) చేసింది ఓ ఇల్లాలు. ఈ కడపలో లోహియానగర్‌లో (Lohia Nagar Kadapa city) చోటుచేసుకుంది.
Kadapa, June 5: జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భార్యాభర్తలు ఒకరిపై, మరొకరు మనస్పర్థలు కలిగి ఘర్షణ పడ్డారు. అనుమానం వేధింపులు ఎక్కువ కావడంతొ తట్టుకోలేక చివరకు భర్తను హత్య (wife killed her husband) చేసింది ఓ ఇల్లాలు. ఈ కడపలో లోహియానగర్‌లో (Lohia Nagar Kadapa city) చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. కడప అక్కాయపల్లెలోని శాసి్త్రనగర్‌కు చెందిన వల్లూరు కిరణ్‌కుమార్ (35)కు కలసపాడు మండలం ముద్దిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తులసితో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు జీవనఆచారి(10), సుశాంత(8) ఉన్నారు. కిరణ్‌కుమార్ కార్పెంటర్ పనిచేసేవాడు. కొన్ని నెలల క్రితం ఇతడి భార్య తులసి సమీప ప్రాంతంలోని బ్యూటీపార్లర్‌లో పనిచేసేది.
ఆమె ఇంటికి ఆలస్యంగా వస్తుండడంతో భార్యపై అనుమాన పడుతుండేవాడు. ఈ నేపధ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ చేశారు. దీంతో వీరు నాలుగు నెలల నుంచి లోహియానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయినా అక్కడ కూడా తరచూ వీరి మధ్య గొడవలు (harassed on suspicion) వస్తుండేవి. ఈక్రమంలో నాలుగురోజులుగా తులసిని, ప్రవర్తన సరిగా లేదని, మార్చుకోవాలని కిరణ్‌కుమార్ గొడవపడేవాడు.
ఈనెల 3వ తేదీ రాత్రి ఇద్దరి మధ్య గొడవ పెద్దదిగా మారింది. కిరణ్‌కుమార్ తన భార్యను కొడుతుండగా, భార్య తులసి తన చేతిలోని కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో భర్త మర్మాంగాల వద్ద తీవ్రగాయమవడంతో రక్తపుమడుగులో పడిపోయాడు. కొనఊపిరితో కొట్టుమిట్డాడుతూ ప్రాణాలను కోల్పోయాడు.
శుక్రవారం ఉదయం బంధువుల ఫిర్యాదు మేరకు కడప డీఎస్పీ సునీల్, తాలుకా ఎస్‌ఐ హుసేన సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుని భార్యపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. కాగా హత్యకు పాల్పడ్డ తులసిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటన అటు తండ్రి లేక ఇటు తల్లి పోలీసుల అదుపులో ఉండటంతో పిల్లలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.