Andhra Pradesh SI Results: ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్! లక్షా 50వేల మంది పరీక్ష రాస్తే క్వాలిఫై అయినవారు ఎంత మంది అంటే?
పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆన్ లైన్ లో ఈ ఫలితాలను విడుదలయ్యాయి. ఏపీలో మొత్తం 411 ఉద్యోగాలకు గాను గత ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. 57,923 మంది అర్హత సాధించారు.
Amaravati, DEC 07: ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐ తుది పరీక్ష తుది ఫలితాలు (SI results) విడుదలయ్యాయి. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆన్ లైన్ లో ఈ ఫలితాలను విడుదలయ్యాయి. ఏపీలో మొత్తం 411 ఉద్యోగాలకు గాను గత ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. 57,923 మంది అర్హత సాధించారు. వీరిలో 31,193 చివరి అక్టోబరు 14, 15 న పరీక్షరాశారు. ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలు బుధవారం AP SLPRB ఫలితాలను విడుదల చేసింది. చివరి రాత పరీక్షకు సంబంధించి పేపర్ -3,పేపర్ -4 ఆన్సర్ షీట్స్ ను డిసెంబర్ 8 సాయంత్రం 5గంటలకు వరకు డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
కాగా ..ఈ పరీక్షలకు సంబంధించి మొత్తం 1లక్షా 50వేల మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ.. 57,923 మంది మాత్రమే అర్హత సాధించారు. వీరికి ఫిజికల్ టెస్టులు నిర్వహించగా 31,193 మంది చివరి రాత పరీక్షకు ఎంపికయ్యారు. ఈ పరీక్షలో 18,637 మంది క్వాలిఫై అయ్యారు. వారు రాసిన పరీక్షకు సంబంధించి తాజాగా ఫలితాలు విడుదల అయ్యాయి.
మొత్తం 411 ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో 18,637 మంది క్వాలిఫై కాగా ..వీరిలో మెరిట్ లో నిలిచిన 411 మందిని పోస్టులకు ఎంపిక చేయనున్నారు. మరి 18,637 మందిలో పోస్టులకు అపాయింట్ మెంట్ అయ్యేది ఎవరో అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.