Andhra Pradesh: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు చేసిన సుప్రీంకోర్టు, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు, ఏ సైకో కళ్లల్లో ఆనందం కోసం ఇలా చేశారని ప్రశ్నించిన ఏబీ వెంకటేశ్వరరావు
ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు (Supreme Court) రద్దు చేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ)ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ ( suspended IPS officer A.B. Venkateswara Rao) కొనసాగించడం కుదరదని పేర్కొంది
Amaravati. April 22: ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు (Supreme Court) రద్దు చేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ)ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ ( suspended IPS officer A.B. Venkateswara Rao) కొనసాగించడం కుదరదని పేర్కొంది. ఆయనను (IPS officer A.B. Venkateswara Rao) మళ్లీ సర్వీసుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావు దిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర ఉన్నతాధికారులపై విమర్శలు గుప్పించారు. 'ఏ బావ కళ్లల్లో ఆనందం కోసం.. ఏ సైకో సంతోషం కోసం.. ఏ శాడిస్ట్ కళ్లలో ఆనందం చూడటం కోసం' తనని సస్పెండ్ చేసి ఇదంతా చేశారని సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు( ab venkateswara rao) ప్రశ్నించారు. ''నా సస్పెన్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. 22 మే 2020న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నాపై విధించిన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని, నిర్హేతుకమని, ఏకపక్ష నిర్ణయమని చెప్పింది. 2020 ఫిబ్రవరి 8వ తేదీ అర్ధరాత్రి నన్ను సస్పెండ్ చేశారు.
దానితో పాటు, ముఖ్యమంత్రి సీపీఆర్వో పూడి శ్రీహరి పంపిన ఒక విష ప్రచారం కూడా అదే సమయంలో విడుదల చేశారు. అందులో నా మీద లేని పోని ఆరోపణలు చేశారు. అది చూసి చాలా మంది నిజమేనని నమ్మారు. నమ్మని వాళ్లు కూడా నన్ను అడగడానికి, ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇబ్బందిపడ్డారు. ఆ పరిస్థితి గమనించి ఒక ప్రత్రికా ప్రకటన విడుదల చేశా. మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని అందులో తెలిపా. మానసికంగా నాకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపాను..
తనను, తన కుటుంబాన్ని క్షోభ పెట్టి సాధించిందేమిటని అడిగారు. ప్రభుత్వానికి, అధికారులకు నిబంధనలు తెలియవా? అని ఆయన ప్రశ్నించారు. కొందరు అధికారులు తప్పుడు కేసులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా చేశారని అన్నారు. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు ఓడిపోవడానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. సస్పెన్షన్ ను ప్రశ్నించడమే తాను చేసిన తప్పా? అని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. లాయర్ల కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసిందని... ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదించేందుకు ఒక లాయర్ల టీమ్ నే ఏర్పాటు చేసిందని తెలిపారు. వీరికి ఎన్ని కోట్లు చెల్లించారో తనకు తెలియదని చెప్పారు.
ఈ కేసుల వల్ల తనకు కూడా అంతే ఖర్చు అయిందని అన్నారు. తన ఫీజును కూడా చెల్లించాలంటూ ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారుల నుంచి రెవెన్యూ రికవరీ చేయాలని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకు వదిలిపెట్టనని చెప్పారు. రెండేళ్లు ముగిసిన తర్వాత సస్పెన్షన్ చెల్లదని చీఫ్ సెక్రటరీకి లేఖ రాశానని... అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదని అన్నారు. తాను ఎప్పుడూ చట్టం ప్రకారమే ముందుకెళ్లానని చెప్పారు. తాను లోకల్ అని... ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. తాను డ్యూటీలో చేరతానని చెప్పారు.
ఒక డీజీపీ ఇచ్చిన ఫోర్జరీ మెమో ఆధారంగా ఒక ఏడీజీ సీఐడీ రాయించిన తప్పుడు రిపోర్ట్ ఆధారంగా, అప్పట్లో ఉన్న ప్రముఖులు, చీఫ్ సెక్రటరీలు ఏమీ చదవకుండానే సంతకాలు పెట్టి 24 గంటల్లో సస్పెన్షన్ రెడీ చేశారు. ఆరు నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ వచ్చారు. తప్పుదారి పట్టించిన అధికారుల ప్రవర్తనను సాక్ష్యాలతో సహా ప్రభుత్వానికి నివేదించా. ఇప్పటివరకూ ఏం చర్యలు తీసుకున్నారో తెలియదు. సీఐడీ డీఎస్పీ రిపోర్టు దగ్గరి నుంచి చీఫ్ సెక్రటరీ వరకూ అందరూ ఒకటే ఆవు మీద వ్యాసం. 'అసలు కొనుగోలే జరగని దానిలో అవినీతి ఎలా జరుగుతుంది?' అని ఒక్కరు కూడా ప్రశ్నించరా? మీకు వృత్తి నైపుణ్యాలు లేవా అని ప్రశ్నించారు.
నన్ను ఇష్టపడే వేల మందిని క్షోభపెట్టి మీరు ఏం సాధించారు? దీనికి ఎంత ఖర్చయింది? కారణం ఎవరు? ప్రజల సొమ్మును ఇలా దుర్వినియోగం చేస్తారా? ఎప్పుడైనా పార పట్టుకుని పొలానికి నీళ్లు పెట్టారా? ఉదయం నుంచి రాత్రి వరకూ ఏదైనా దుకాణంలో కూర్చొన్నారా? బండి మీద కూరగాయలు వేసుకుని వీధివీధి తిరగండి అసలు శ్రమ విలువ ఏంటో తెలుస్తుంది. చెమటోడ్చి ప్రజలు కడుతున్న పన్నులను దొంగ కేసులు వేసి ఖర్చు చేయడానికి మీకు పాపం అనిపించటం లేదా? ఇందుకోసమా మనం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అయిందని ప్రశ్నించారు.
''ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చారు? ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న అధికారులను బుద్ధి వచ్చేలా శిక్షించాలని, ప్రభుత్వానికి అయిన ఖర్చు అలాంటి అధికారుల జేబులను నుంచి వసూలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ప్రభుత్వం తలుచుకుంటే రెవెన్యూ రికవరీ చేసి వారి నుంచి వసూలు చేయవచ్చు. ప్రతి రూపాయికీ లెక్క చెప్పాల్సిందే. రెండేళ్లకు మించి సస్పెన్షన్ పొడిగించటానికి అవకాశం లేదని ఇటీవల సీఎస్‌కు లేఖరాశా. ఏమాత్రం చలనం లేదు.
ఆయనకు రూల్స్ తెలియదా? ఆయన స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం సుప్రీంకోర్టు వరకూ ఎందుకు వచ్చింది. ప్రభుత్వాలను నడిపేవాళ్లు వస్తుంటారు పోతుంటారు. నా సర్వీసులో పది, పన్నెండు బ్యాచ్‌లను చూశా. అలాగే చీఫ్ సెక్రటరీలు కూడా వస్తుంటారు పోతుంటారు. ప్రజలు, వాళ్లు రాసుకున్న శాసనమే శాశ్వతం. న్యాయం, ధర్మం శాశ్వతం. నేను లోకల్ ఎవరినీ వదిలి పెట్టను'' అని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)