Dhulipalla Narendra Arrested: ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్, చలో అనుమర్లపూడికి అనుమతి లేదని తెలిపిన పోలీసులు, గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉందని స్పష్టం
గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, గ్రామంలో మట్టి తవ్వకాలపై చలో అనుమర్లపూడికి ధూళిపాళ్ల పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చలో అనుమర్లపూడికి అనుమతి లేదంటూ పోలీసులు.. గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉందని స్పష్టం చేశారు.
Guntur, June 20: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, గ్రామంలో మట్టి తవ్వకాలపై చలో అనుమర్లపూడికి ధూళిపాళ్ల పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చలో అనుమర్లపూడికి అనుమతి లేదంటూ పోలీసులు.. గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీ సంఖ్యలో మోహరించారు. అనంతరం, ధూళిపాళ్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు, వాహనాల కొనుగోలు విషయంలో జరిగిన లావాదేవీలపై లోతుగా పరిశీలన
అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ కుమార్, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల మ్యానీలు హౌస్ అరెస్ట్ చేశారు. చలో అనమర్లపూడి నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. అనమర్లపూడిలో భారీగా పోలీసులు మోహరించారు. అనమర్లపూడి వెళ్లే రోడ్లలో చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు.