ED Raids: జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు, వాహనాల కొనుగోలు విషయంలో జరిగిన లావాదేవీలపై లోతుగా పరిశీలన
TDP Ex MLA JC Prabhakar Reddy (Photo-ANI)

Amaravati, June17: అనంతపురం జిల్లా తాడాపత్రిలో ఉన్న టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంట్లో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు (ENFORCEMENT DIRECTORATE) తనిఖీలు నిర్వహించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్లపై ఆరా తీశారు. స్క్రాప్‌ కింద వాహనాలు కొనుగోలు చేసి నకిలీ ఇన్వాయిస్‌తో జేసీ ట్రావెల్స్‌ నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసింది. సుమారు వందకు పైగా వాహనాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. ఆయనతో పాటుగాక్లాస్ 1 కాంట్రాక్టర్, జేసీ ముఖ్య అనుచరడు చవ్వా గోపాల్‌రెడ్డి ఇంట్లోనూ ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. మేము కంపెనీ సెక్రటరీలం కాదు, హైకోర్టు జడ్జీలం, రఘురామకృష్ణరాజు పిల్‌పై మండిపడిన ఏపీ హైకోర్టు, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని వెల్లడి

జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy's residence) ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తి పత్రాలను పరిశీలిస్తున్నారు. మొత్తం 20 మంది ఈడీ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. తాడిపత్రిలో బారీ బందోబస్తు నడుమ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈడీ అధికారులు తనిఖీ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం.వాహనాల కొనుగోలు విషయంలో జరిగిన లావాదేవీలపై లోతుగా పరిశీలిస్తున్నారు. తనిఖీల సమయంలో జేసీ సోదరుల ఉమ్మడి ఆస్తుల వివరాలపై వారిని ప్రశ్నిస్తున్నారు.