Srikakulam Man Dies in America: పొట్టకూటి కోసం అమెరికాకు, ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే కంటెయినర్‌పై నుంచి జారిపడి మృతి చెందిన శ్రీకాకుళం వాసి, శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

పొట్టకూటి కోసం అమెరికా వెళ్లిన శ్రీకాకుళం యువకుడు లాస్‌ ఏంజెల్స్‌ పోర్టులో మృతి చెందాడు. ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

Representational Image (Photo Credits: Twitter)

Los Angeles, Jan 27: ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదకర ఘటన (Srikakulam Man Dies in America) చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం అమెరికా వెళ్లిన శ్రీకాకుళం యువకుడు లాస్‌ ఏంజెల్స్‌ పోర్టులో మృతి చెందాడు. ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన టి. రవికుమార్‌(35) అనే యువకుడు నౌకలో పనిచేసేందుకు మరో 10 మందితో కలిసి ఈనెల 17న అమెరికాకు వెళ్లాడు.

మూడురోజుల కిందట అతడు సీమన్‌గా ఉద్యోగంలో చేరాడు. విధులు నిర్వహిస్తుండగా రవికుమర్‌ కంటెయినర్‌పై నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి (Seaman from Srikakulam dies in Port of Los Angeles) చెందాడు.ఈ విషయం కంపెనీ ప్రతినిధులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన కుటుంబ సభ్యుడు మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సహాయపడాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

రేపు పెళ్లి.. అర్థరాత్రి దాకా పనులు చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన పెళ్లి కొడుకు, చికిత్స పొందుతూ మృతి, రెండు కుటుంబాల్లో తీరని విషాదం

రవికుమార్‌ కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ కుమార్‌ ఏడేళ్లకుపైగా వెల్డర్‌గా పనిచేశాడని, వారంరోజుల క్రితం సీమాన్‌గా చేరాడని, కొద్దిరోజుల క్రితం లాస్‌ ఏంజెల్స్‌ పోర్టుకు వెళ్లాడని తెలిపారు.అతనికి తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు- అను,పల్లవి ఉన్నారు. నివేదికల ప్రకారం, కుమార్ సూపర్ స్ట్రక్చర్ నుండి ఓడ యొక్క డెక్‌పై నుంచి 50 అడుగుల కింద పడిపోయాడు. రెస్క్యూ, వైద్య బృందాలు అతనిని రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ అతనిని కాపాడలేకపోయారు. అయితే నిర్మాణం నుండి పడిపోవడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.

పాముతో సెల్పీ, కాటేయడంతో మృతి చెందిన యువకుడు, ప్రకాశం జిల్లాలో విషాదకర ఘటన

నలుగురు అన్నదమ్ములలో రవి కుమార్ చిన్నవాడు. అతని ఇద్దరు సోదరులు కొన్ని సంవత్సరాల క్రితం విషాద సంఘటనలలో మరణించారు. ఇప్పుడు ఈ విషాద ఘటనలో వారి కుటుంబానికి ఏకైక ఆధారం రవికుమార్ కూడా మృతి చెందాడు. రవికుమార్ ఆకస్మిక మృతితో మా జీవితం అతలాకుతలమైందని, బాధిత కుటుంబ సభ్యులకు షిప్పింగ్ కంపెనీ నష్టపరిహారం అందజేస్తుందని ఆశిస్తున్నామని బాధితుడు బంధువులు తెలిపారు.



సంబంధిత వార్తలు

Andhra Pradesh Assembly Session: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా

YS Sharmila: జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన వైఎస్‌ షర్మిల, ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు..ఇదంతా చేయించింది జగనే...అప్పుడు ఎందుకు ఎంక్వైరీ అడగలేదో చెప్పాలని షర్మిల డిమాండ్

PAC Elections: వైసీపీ సంచలన నిర్ణయం, పీఏసీ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Gautam Adani Bribery Case: లంచం ఆరోపణలను ఖండించిన వైసీపీ, అదాని గ్రూపుతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని ప్రకటన, సెకీతోనే ఒప్పందం చేసుకున్నామని వెల్లడి