Andhra Pradesh: భర్త ఇంటికి వచ్చేసరికి బెడ్ రూంలో ప్రియుడితో భార్య, ఆ దృశ్యాన్ని చూడలేక కోపంతో భార్య ప్రియుడిని కత్తితో నరికేసిన భర్త,నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు
వివాహేతర సంబంధం (extramarital affair in Anantapur) కారణంగా ఓ యువకుడు తన ప్రియురాలి భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.
Amaravati, Oct 13: ఏపీలో అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం (extramarital affair in Anantapur) కారణంగా ఓ యువకుడు తన ప్రియురాలి భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అనంతపురం జిల్లా పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గుంతకల్లు మండలం గుండాలతండాకు చెందిన స్వామి నాయక్, మంగమ్మ దంపతులు కొన్నేళ్ల క్రితమే గుంతకల్లుకు చేరుకుని చైతన్య థియేటర్ సమీపంలో అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు.
వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. అయితే హైదరాబాద్‌లో స్వామినాయక్ కారు డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబ పోషణకు నెలకు డబ్బు పంపించేవాడు. ఈ క్రమంలో స్వామినాయక్ చిన్నాన్న కుమారుడు సుంకేనాయక్ తరచూ మంగమ్మ ఇంటికి రాకపోకలు సాగించేవాడు.అది కాస్తా ఇద్దరి మధ్యా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కాగా బుధవారం ఉదయం ఇద్దరు పిల్లలు స్కూల్‌కు వెళ్లిన తర్వాత మంగమ్మ ఇంటికి సుంకేనాయక్ చేరుకున్నాడు.
ఇద్దరూ రాసలీలల్లో మునిగితేలారు.అయితే కాసేపటికి స్వామినాయక్ కూడా ఇంటికెళ్లాడు. ఆ సమయంలో బెడ్‌రూంలో సుంకేనాయక్, మంగమ్మ ఏకాంతంగా ఉండడం చూసి కోపోద్రిక్తుడైన స్వామినాయక్ కత్తితో సుంకేనాయక్‌పై దాడి (young man Killed his wife lover) చేశాడు.
అడ్డుకోబోయిన భార్య మంగమ్మ తలపై బాది నేరుగా వెళ్లి కసాపురం పోలీసులకు లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని డీఎస్పీ నర్శింగప్ప, టూటౌన్ సీఐ చిన్నగోవిందు పరిశీలించారు. అప్పటికే సుంకేనాయక్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మంగమ్మను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.