Tamil Nadu Shocker: హిజ్రాలపై మగాళ్లు దారుణం, పొలంలోకి లాక్కెళ్లి చీర చించేసి, బ్లేడ్‌తో జుట్టును కోసేసిన యువకులు, నిందితులను అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు

తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్‌జెండర్ల పట్ల ఇద్దరు వ్యక్తులు మానవత్వం మరిచి ప్రవర్తించారు.ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను వేధించడమే కాకుండా.. వారిని ఎగతాళి చేస్తూ మాట్లాడారు.

Tamil Nadu Shocker: హిజ్రాలపై మగాళ్లు దారుణం, పొలంలోకి లాక్కెళ్లి చీర చించేసి, బ్లేడ్‌తో జుట్టును కోసేసిన యువకులు, నిందితులను అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Transgender Woman's Hair Forcibly Cut, 2 Arrested Watch (Photo-ANI)

Chennai, Oct 13: తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్‌జెండర్ల పట్ల ఇద్దరు వ్యక్తులు మానవత్వం మరిచి ప్రవర్తించారు.ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను వేధించడమే కాకుండా.. వారిని ఎగతాళి చేస్తూ మాట్లాడారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్రాన్స్‌జెండర్‌ హక్కుల కార్యకర్త గ్రేస్‌ బాను ట్విటర్‌లో షేర్‌ చేశారు. 19 సెంకడ్ల నిడివి ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

హిజ్రాపై దారుణానికి తెగబడ్డ ఇద్దరు యువకులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ (2 Arrested Watch )చేశారు.ఓ హిజ్రాను పొలంలో చీర చించేసి.., జుట్టు కత్తిరించి (Transgender Woman's Hair Forcibly Cut) చిత్రవధ చేస్తూ హింసించారు. వీడియోలో.. బ్లేడ్‌తో హిజ్రా జుట్టును కోసేసి పొలంలో పడేశారు. ఆమె ముఖం దాడి మూలంగా ఛిద్రమైనట్లు కనిపిస్తోంది.

Here's Video

ఆ పక్కనే మరో హిజ్రా ఉండగా.. దాడికి పాల్పడ్డ ఇద్దరు యువకులు ‘‘వీళ్లను చూడండి. ఇంతకాలం మగవాళ్ల నుంచి డబ్బు దోచుకున్నారు. ఇప్పుడు మనమేం చేయాలి? అంతా అయిపోయింది. వీళ్లేం అందంగా కనిపించడం లేదు కదా’’ అంటూ గట్టిగట్టిగా అరిచారు.మరో వీడియోలో హిజ్రాలు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు వైరల్‌ అయ్యింది.

షాకింగ్ వీడియో, ట్రాన్స్‌జెండర్ల జుట్టు కత్తిరించి వారిని సూటి పోటీ మాటలతో వేధించిన ఇద్దర వ్యక్తులు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

నిందితులను నోవాహ్‌, విజయ్‌గా నిర్ధారించారు. ఆ ఇద్దరికి వీడియోలో ఉన్న హిజ్రాలు బాగా తెలుసని, వాళ్లలో ఓ జంటకు సంబంధం కూడా ఉందని, కానీ, విడిపోవడంతోనే ఇలా దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.

(The above story first appeared on LatestLY on Oct 13, 2022 02:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).