YSR Sunna Vaddi Scheme: రాక్షసులతో, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాం, పేదలకు మంచి చేయొద్దని టీడీపీ నేతలు చెబుతున్నారని మండిపడిన జగన్, మూడో విడత వైఎస్సార్‌ సున్నా వడ్డీ నిధులను విడుదల చేసిన ఏపీ సీఎం

స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని (YSR Sunna Vaddi Scheme) వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం (YS Jagan disburse third tranche) కింద రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.

AP CM YS Jagan |File Photo

Ongole, April 22: వైఎస్సార్‌ సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని (YSR Sunna Vaddi Scheme) వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం (YS Jagan disburse third tranche) కింద రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. 9.76 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,02,16,410 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.1,261 కోట్ల వడ్డీ సొమ్ము జమ చేశారు. ఈ సొమ్ముతో కలిపి ఇప్పటి దాకా ఈ పథకం కింద రూ.3,615 కోట్లు సాయం అందించినట్లయింది.

ఈ సందర్భంగా సీఎం జగన్ (CM YS Jagan) మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా దాదాపు కోటి 2లక్షల 16 వేలమందికి పైగా అక్క చెల్లెమ్మలకు మేలు కలిగిందని తెలియజేశాారు. ‘‘గతంలో 12శాతం దాకా వడ్డీలు కట్టాల్సి వచ్చేది. అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్న ఆలోచనే గత ప్రభుత్వం చేయలేదు. పైగా సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితులున్నాయి. కానీ మన ప్రభుత్వంలో ప్రతి ఏడాది మహిళలకు భరోసా ఇస్తున్నాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

శ్రీ సిటీలో రూ.600 కోట్లు ఖర్చుతో ప్యానాసోనిక్‌ ప్లాంటు, దక్షిణాదిన ఇదే తొలి ప్లాంటు కాగా దేశవ్యాప్తంగా ఏడవది

సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో 1,36,694 కోట్లు లబ్ధిదారులకు అందించామని ఆయన పేర్కొన్నారు. ఎక్కడా లంచాలకు తావులేకుండా లబ్ధిదారులకు మేలు జరిగిందని ప్రస్తావించారు. అంతేకాదు.. సామాజిక న్యాయం అన్నది మాటల్లో కాదు.. చేతల్లో చూపించిన ప్రభుత్వం తమదని, మంత్రి పదవులు 70 శాతం దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. గడిచిన మూడేళ్లలో మొత్తం రూ.3,165 కోట్లు అక్కాచెల్లెమ్మలకు అందజేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముందుగా సాధికారత సారధులకు అభినందనలు తెలియజేశారు. తొలి ఏడాది సున్నా వడ్డీ కింద ప్రభుత్వం రూ.1,258 కోట్లు చెల్లించిందని, రెండో ఏడాది రూ.1,096 కోట్లు, వరుసగా ఇప్పుడు మూడో ఏడాది రూ. 1,261 కోట్లు చెల్లిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలియజేశారు.

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా దాదాపు కోటి 2లక్షల 16 వేలమందికి పైగా అక్క చెల్లెమ్మలకు మేలు కలిగిందని తెలియజేశారాయాన. ‘‘గతంలో 12శాతం దాకా వడ్డీలు కట్టాల్సి వచ్చేది. అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్న ఆలోచనే గత ప్రభుత్వం చేయలేదు. పైగా సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితులున్నాయి. కానీ మన ప్రభుత్వంలో ప్రతి ఏడాది మహిళలకు భరోసా ఇస్తున్నాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో యువతి నోట్లో గుడ్డలు కుక్కి ముగ్గురు గ్యాంగ్‌ రేప్, లైంగిక బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ సీఎం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో 1,36,694 కోట్లు లబ్ధిదారులకు అందించామని ఆయన పేర్కొన్నారు. ఎక్కడా లంచాలకు తావులేకుండా లబ్ధిదారులకు మేలు జరిగిందని ప్రస్తావించారు. అంతేకాదు.. సామాజిక న్యాయం అన్నది మాటల్లో కాదు.. చేతల్లో చూపించిన ప్రభుత్వం తమదని, మంత్రి పదవులు 70 శాతం దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు.

అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. చరిత్రలో నిలిచిపోయే అక్కచెల్లెమ్మల విజయగాథ ఇది. ప్రభుత్వంపై నమ్మకమున్న అక్కచెల్లెమ్మల విజయగాథ ఇది. మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. దుష్టచతుష్టయం కడుపు మంటతో ఉంది. మహిళల్ని గత ప్రభుత్వం నట్టేట ముంచింది. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. మహిళలకు రూ. 3,036కోట్లు ఇస్తామని ఎగనామం పెట్టిందని సీఎం అన్నారు.

మన ప్రభుత్వ హయాంలో స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల సంఖ్య 80 లక్షల నుంచి కోటీ 2 లక్షలకు పెరిగింది. అక్కచెల్లెమ్మలను అప్పుల ఊబిలోంచి బయటకు లాగాం. పొదుపు సంఘాల సభ్యుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. మనది మహిళా పక్షపాతి ప్రభుత్వం. టీడీపీ హయాంలో 44 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. మన హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. రూ.2500 అవ్వాతాత చేతుల్లో పెడుతున్నామని సీఎం తెలిపారు.

ఢిల్లీలో పట్టపగలే దారుణం, పిల్లల ముందే మహిళను కిరాతకంగా పొడిచి చంపిన దుండుగుడు, అనంతరం పరార్, నిందితుడిని గుర్తించి, పట్టుకునేందుకు పోలీసులు వేట

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద ఏటా రూ.2వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన చేసిన ప్రభుత్వం మనది. వైఎస్సార్‌ చేయూతతో రూ.9,180 కోట్లు చెల్లించాం. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద రూ.589 కోట్లు చెల్లించాం. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. నాలుగింట ఒకవంతు మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదు. జగనన్న విద్యాదీవెనలో 21.55లక్షల మందికి సాయం చేశాం. పిల్లల చదువులకు పూర్తి పీజు రీఎంబర్స్‌మెంట్‌ చేశాం. జగనన్న విద్యాదీవెనలో రూ.6,966 కోట్లు ఇచ్చాం. పాతబకాయిలను కూడా మనమే తీర్చామని అన్నారు.

ఉచితంలో ఆర్థిక విధ్వంసం అని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. ఏపీని మరో శ్రీలంకగా మారుస్తున్నారని అంటున్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబులా పక్కన పడేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ పథకాలను ఆపేయాలని టీడీపీ నేతలు అంటున్నారు. పేదలకు మంచి చేయొద్దని అంటున్నారు. ఇలాంటి రాక్షసులతో, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు