New Pension Cards: ఏపీలో కొత్త పెన్సన్ కార్డులు వచ్చేశాయి, నేటి నుంచి పంపిణీ చేయనున్న గ్రామ వాలంటీర్లు, కొత్తగా ఫించన్ మంజూరైన వారికి పుస్తకంతోపాటు గుర్తింపు కార్డు

నేటి నుంచి లబ్దిదారులకు ప్రత్యేక పెన్షన్‌ గుర్తింపు కార్డులు అందజేయనుంది. వివిధ రకాల పింఛన్లకు సంబంధించి ఫిబ్రవరిలో 54,68,322 మందికి ప్రభుత్వం నిధులు విడుదల చేయగా.. వారందరికీ సోమవారం నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వలంటీర్ల ద్వారా కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో రాజాబాబు తెలిపారు.

andhra-pradesh-YS-Jagan-government-to-distribute-new-pension-cards-from-today (Photo-Twitter)

Amaravathi, Febuary 17: ఇటీవలే కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) పంపిణీని ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వం (AP Govt) పెన్షన్ పొందే లబ్దిదారులకు కూడా కొత్త కార్డులను (New Pension Cards) పంపిణీ చేయబోతుంది. నేటి నుంచి లబ్దిదారులకు ప్రత్యేక పెన్షన్‌ గుర్తింపు కార్డులు అందజేయనుంది.

వివిధ రకాల పింఛన్లకు సంబంధించి ఫిబ్రవరిలో 54,68,322 మందికి ప్రభుత్వం నిధులు విడుదల చేయగా.. వారందరికీ సోమవారం నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వలంటీర్ల ద్వారా కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో రాజాబాబు తెలిపారు.

కొత్త రేషన్ కార్డులు వచ్చేశాయి

ఫిబ్రవరి నెలలో కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి పింఛను పుస్తకంతోపాటు గుర్తింపు కార్డు ఇస్తారు. మిగిలిన పాత పింఛనుదారులందరికీ ఇప్పటికే పింఛను పుస్తకాలు పంపిణీ చేసిన నేపథ్యంలో వారికి కొత్తగా కేవలం గుర్తింపు కార్డులను మాత్రమే పంపిణీ చేయనున్నట్లు ఆయన వివరించారు. ఇదిలావుండగా.. అనర్హులుగా తేలిన వారికి సంబంధించి ప్రస్తుతం రీ సర్వే జరుగుతోందని, ఇందులో అర్హులుగా తేలిన వారికి మార్చి 1వ తేదీన గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే కొత్తగా 6,14,244 మందికి పింఛన్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

జూన్ 1 నుంచి వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ అమల్లోకి

ఇదిలా ఉంటే చాలామంది పెన్షన్లు తీసివేశారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన సీఎం జగన్ కీలక మార్గనిర్దేశకాలు విడుదల చేశారు. మరోసారి రీ సర్వే జరిపి, అర్హులైన వారిని తొలిగించినట్లయితే..వారిని తిరిగి జాబితాలో చేర్చి.. వచ్చే నెల రెండు నెలల పెన్షన్ కలిపి ఇవ్వాలని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రొసెస్ ప్రస్తుతం కొనసాగుతోంది.

ఒకే దేశం- ఒకే రోజున వేతనం

కాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు కొత్తగా 6,14,244 మందికి పింఛన్లు మంజూరు చేసింది. పెన్షన్ బుక్‌, గుర్తింపు కార్డుల విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే గ్రామ లేదా వార్డు వాలంటీర్లను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు.